ఉత్సాహంగా అశ్మిత సౌత్‌జోన్‌ హాకీ పోటీలు | - | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా అశ్మిత సౌత్‌జోన్‌ హాకీ పోటీలు

Oct 31 2026 12:07 AM | Updated on Oct 31 2026 12:07 AM

నాగమల్లితోట జంక్షన్‌ (కాకినాడ సిటీ): కోకనాడ కోస్టర్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో అశ్మిత సబ్‌ జూనియర్‌, జూనియర్‌ సౌత్‌ జోన్‌ హాకీ పోటీలు శుక్రవారం ఉత్సాహంగా జరిగాయి. మొదటి మ్యాచ్‌లో కోకనాడ క్లబ్‌ జట్టు ఫ్రెండ్స్‌ క్లబ్‌పై 29–0 స్కోర్‌తో, రెండో మ్యాచ్‌లో కోకనాడ స్పోర్ట్స్‌ క్లబ్‌ 9–0 స్కోర్‌తో, మూడో మ్యాచ్‌లో వడిపట్టి రాజా హాకీ అకాడమీ జట్టుపై కేరళ హాకీ జట్టు 7–0 స్కోర్‌తో, ఐదో మ్యాచ్‌లో ఆర్‌డీడీ అనంతపురం, కేరళ జట్టుపై 5–3 స్కోర్‌తో గెలుపొందాయి. శుక్రవారం నిర్వహించిన మ్యాచ్‌లను కోకనాడ కోస్టల్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌ వ్యవస్థాపకులు రవిచంద్ర, టోర్నమెంట్‌ నిర్వహణా కమిటీ కార్యదర్శి రజని, ఉపాఽధ్యక్షురాలు సుధారాణి, సభ్యులు దీప్తి ఎస్తేర్‌, సురేష్‌రాజు, సూరిబాబు, కోకనాడ కోస్టల్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌ అధ్యక్షుడు బాబ్జి, హరిబాబు పర్యవేక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement