లంచం తీసుకుంటూ
పట్టుబడిన ఫైర్ ఆఫీసర్
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరం కోటిపల్లి బస్టాండ్ వద్ద ఉన్న అగ్నిమాపక కేంద్రంలో లంచం తీసుకుంటూ జిల్లా అగ్నిమాపక శాఖాధికారి పేరూరి శ్రీనివాస్ శుక్రవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ ఏఎస్పీ భవ్యకిశోర్ ముందస్తు సమాచారంతో అగ్నిమాపక శాఖ కార్యాలయంపై దాడి చేశారు. ఆ సమయంలో శ్రీనివాస్ రూ.65 వేలు లంచం తీసుకుంటుండగా, రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. రాజానగరానికి చెందిన బెజవాడ వెంకటేశ్వరరావుకు ఐదు బాణసంచా దుకాణాలున్నాయి. వాటికి సంబంధించి లైసెన్సులు పొందేందుకు అగ్నిమాపక శాఖ కార్యాలయానికి వచ్చాడు. దుకాణాలకు లైసెన్సు ఇచ్చేందుకు పలు సమస్యలు ఉన్నాయని, ఆ కారణంగా లైసెన్సు ఇవ్వాలంటే కొంత నగదు ఖర్చవుతుందని శ్రీనివాస్ చెప్పాడు. దీంతో దుకాణ నిర్వాహకుడు వెంకటేశ్వరరావు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారు వల పన్ని శ్రీనివాస్‌ను పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏఎస్పీ భవ్యకిశోర్ మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం అడిగితే వెంటనే తమకు ఫోన్ చేయాలన్నారు. తూర్పుగోదావరి, డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, పోలవకం జిల్లాల్లో ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే వెంటనే 1064కు, అలాగే తన నంబర్ 94404 46102కు ఫోన్ చేయవచ్చన్నారు.


