హతవిధిలా.. | - | Sakshi
Sakshi News home page

హతవిధిలా..

Nov 1 2026 12:09 AM | Updated on Nov 1 2026 12:09 AM

ఫ ఎన్నికల సిబ్బందికి ప్రత్యక్ష నరకం

ఫ అన్నం పెట్టాలంటే ఘర్షణకు దిగిన దుస్థితి

ఫ మరుగుదొడ్లు లేక మహిళా సిబ్బందికి ఇబ్బంది

కాకినాడ క్రైం: మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా ఆదివారం జరిగే పోలింగ్‌ విధులకు హాజరైన సిబ్బంది నరకం చూశారు. శనివారం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పోలింగ్‌ కేంద్రాలకు సిబ్బంది వెళ్లారు. అత్యంత కీలక విధులు నిర్వహిస్తున్న వీరికి భోజనం, వసతి సహా కనీస ఏర్పాట్లు లేవు. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీలలో మొత్తం 1,647 మంది ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్నారు. అధిక శాతం విద్యాశాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ సిబ్బందిని నియమించారు. జిల్లా నలుమూలల నుంచి వీరంతా రిపోర్టింగ్‌ కేంద్రాలకు వారి సొంత వాహనాల్లోనే చేరుకున్నారు. అక్కడ వారికి అల్ఫాహారం ఏర్పాటు చేయలేదు. చివరికి గొడవ పడాల్సి వచ్చింది. మధ్యాహ్నం విదిల్చిన ఆ మెతుకులే రాత్రి వరకు సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పలుచోట్ల రాత్రి 8 గంటల వరకు ఎటువంటి అల్ఫాహారం పెట్టలేదు. వెళ్లిన చోట బాత్రూమ్‌లు లేక ఆడ, మగ పడరాని పాట్లు పడ్డారు. ఒక సెంటర్లో 4–5 ఎన్నికల గదులు ఉంటే, ఒక్కో గదిలో కనీసం ఐదుగురు సిబ్బందిని నియమించారు. వారిలో కనీసం ముగ్గురు సీ్త్రలు, ఇద్దరు పురుషులు ఉండగా, వారు నిద్రించేందుకు ఆ గదిలోనే ఏర్పాట్లు చేశారు.

ఎక్కడెక్కడంటే...

సామర్లకోట బ్రౌన్‌పేట సహా జిల్లాలో ఏ ఒక్క చోట సిబ్బందికి అల్పాహారం పెట్టలేదు. అన్నం పెట్టండంటూ గొడవ పడాల్సిన దయనీయ స్థితి తలెత్తింది. అల్ఫాహారం లేక మధుమేహ బాధితులు సొమ్మసిల్లిపోయినంత పనైంది. ఆహారం కోసం అధికారులతో గొడవ పడాల్సి వచ్చింది. చేసిన గొడవకు ఫలితంగా మధ్యాహ్నం భోజనం ఓ గంట ముందే పెట్టేస్తామని కరుణించారు. మధ్యాహ్నం 2 గంటలకు అని తొలుత చెప్పి గొడవ పెట్టి అడిగినందుకు భోజనం 12.30కి పెట్టారు. తుని పంచాయతీరాజ్‌ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరింగ్‌ ఆఫీస్‌ (టీబీ బంగ్లా)ను ఎన్నికల కేంద్రంగా ఏర్పాటు చేశారు. 15 ఏళ్ల క్రితం మూసేసిన ఈ బంగ్లాను తెరిచి పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేశారు. ఇక్కడ బాత్రూమ్‌లు లేక సిబ్బంది ఇబ్బంది పడ్డారు. డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ ఇలాకా పిఠాపురంలోని మంగాయమ్మరావు పేట పోలింగ్‌ కేంద్రంలో ఒకే గదిలో పురుషులు, సీ్త్రలు నిద్రించాల్సిన దయనీయ స్థితి కొనసాగింది. వారికి ఆహార ఏర్పాట్లు చేయలేదు. బాత్రూమ్‌లు లేవు. ఇలా జిల్లా వ్యాప్తంగా ఉన్న 321 పోలింగ్‌ కేంద్రాల్లోనూ దాదాపుగా ఇదే పరిస్థితి కొనసాగింది. సామర్లకోటలో ఓ పోలింగ్‌ కేంద్రంలో శనివారం రాత్రి వరకు కుర్చీలు ఏర్పాటు చేయలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement