వైఎస్సార్‌ సీపీలో ప్రతి ఒక్కరికీ ఆదరణ | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీలో ప్రతి ఒక్కరికీ ఆదరణ

Oct 8 2026 12:12 AM | Updated on Oct 8 2026 12:12 AM

● ప్రత్తిపాడు కోఆర్డినేటర్‌ ముద్రగడ

● శంఖవరంలో టీడీపీకి చెందిన 55 కుటుంబాలు వైఎస్సార్‌ సీపీలో చేరిక

కిర్లంపూడి: వైఎస్సార్‌ సీపీలో ప్రతి ఒక్కరికీ ఆదరణ లభిస్తుందని నియోజకవర్గం పార్టీ కో ఆర్డినేటర్‌ ముద్రగడ గిరిబాబు తెలిపారు. బుధవారం శంఖవరం గ్రామానికి చెందిన పొలమాటి శాంతిభరత్‌, కనికెళ్ల బ్రెనేట్‌బాబు, మణిబాబు ఆధ్వర్యంలో టీడీపీకి చెందిన కో ఆప్షన్‌ మాజీ సభ్యుడు బెనర్జీ మరో 55 కుటుంబాలు మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ పీఏసీ సభ్యుడు ముద్రగడ పద్మనాభం నివాసానికి తరలివచ్చి గిరిబాబు సమక్షంలో వైఎస్సార్‌ సీపీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ సీఎం జగన్‌ నిరుపేదల సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెట్టి నూరుశాతం అమలు చేశారని, అలాగే గిరిబాబు నియోజకవర్గంలో పార్టీ పటిష్టతకు చేస్తున్న కృషి, కార్యకర్తలకు ఆయన ఇస్తున్న భరోసా తమకు నచ్చి పార్టీలో చేరినట్టు తెలిపారు. గిరిబాబు నాయకత్వంలో రాబోయే స్థానిక ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేస్తామని తెలిపారు. గిరిబాబు మాట్లాడుతూ పార్టీ విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ తాను అండగా ఉంటానని హామీ ఇచ్చి వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. పార్టీ మండల కన్వీనర్‌ నరాల శ్రీనివాస్‌తో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement