ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడి మృతి | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడి మృతి

Sep 19 2026 12:22 AM | Updated on Sep 19 2026 12:22 AM

గోకవరం: మండలం కామరాజుపేట శివారులో ఆర్టీసీ బస్సు బైక్‌ను ఢీకొన్న ఘటనలో యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గోకవరం ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు శుక్రవారం ప్రయాణీకులతో అడ్డతీగల వెళ్తోంది. కామరాజుపేట శివారు వచ్చే సరికి ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జగ్గంపేటకు చెందిన వామిశెట్టి ఆనంద్‌కుమార్‌ (26) తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. వ్యాపారం నిమిత్తం నెల్లిపూడికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎస్సై పవన్‌కుమార్‌ ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గోకవరం ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తల్లిదండ్రులకు బాలిక అప్పగింత

తుని: ఇంటిలో ఎవరికీ చెప్పకుండా రైలులో వచ్చిన విజయనగరం జిల్లా మెంటాడ మండలం చల్లపల్లి గ్రామానికి చెందిన ఏడిబిల్లి భానును తుని జీఆర్పీ సిబ్బంది ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. శుక్రవారం జీఆర్పీ హెడ్‌ కానిస్టేబుల్‌ శ్రీనివాసరావు తెలిపిన వివరాల మేరకు భాను విజయనగరం నుంచి విశాఖ రైల్వేస్టేషన్‌కు చేరుకుని అక్కడ కడప వెళ్లే తిరుమల ఎక్స్‌ప్రెస్‌ ఎక్కి జనరల్‌ భోగీలో కూర్చుంది. బెదురు చూపులు చూస్తున్న ఆమె గురించి ప్రయాణికులు రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు ఆమెను కాకినాడ జిల్లా తునిలో దించి రైల్వే పోలీసు స్టేషన్‌కు తీసుకువెళ్లి సమాచారం సేకరించారు. బాలిక తల్లి జానకి ఏఎన్‌ఎంగా పని చేస్తున్నట్టు గుర్తించి ఆండ్ర పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇచ్చి తుని వచ్చిన తల్లిదండ్రులు, బంధువుల సమక్షంలో బాలికను అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement