వ్యవస్థలను మేనేజ్ చేసే నాయకుల వల్ల ప్రజలకు న్యాయం జరగదు. చంద్రబాబు ప్రభుత్వంలో ప్రజల మానప్రాణాలకు రక్షణ లేదు. రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట మహిళలపై అత్యాచారాలు, దళితులపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. వాటిపై ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెడుతున్నారు. జరిగిన సంఘటనలను వ్యవస్థల సాయంతో వక్రీకరించి ప్రజలను ఏమార్చుతున్నారు. అధికారంలో ఉండి ఇష్టానుసారం చేయొచ్చన్నట్లు చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. సీసీ కెమెరాల ఫుటేజీ లేదని చెప్పడం సరికాదు. శాంతిభద్రతల విషయంలో పోలీసులతో పాటు సీఎం చంద్రబాబు కూడా బాధ్యత తీసుకోవాలి. ఆయన మాటలన్నీ అబద్ధాలే. వ్యక్తి గొప్ప కోసం వ్యవస్థలను నాశనం చేస్తున్నారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత బాధ్యత మరచిపోవడం వల్లే రాష్ట్రంలో నేరాలు పెరిగిపోయాయి.
– చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు


