పర్యావరణ పరిరక్షణ కోసం | - | Sakshi
Sakshi News home page

పర్యావరణ పరిరక్షణ కోసం

Sep 12 2026 12:24 AM | Updated on Sep 12 2026 12:24 AM

పర్యావరణ పరిరక్షణ కోసం తన వంతు కృషి చేయాలనే సంకల్పంతో ప్రతి ఏటా సుమారు 2 వేల మట్టి విగ్రహాలు పంపి ణీ చేస్తున్నాను. నాతో పాటు బి.రవికు మార్‌ కూడా విగ్రహాలు పంపిణీకి సహకారం అందిస్తున్నారు. గత 12 సంవత్సరాలుగా వినాయక చవితి సందర్భంగా మట్టి విగ్రహాలు తయారు చేయించి పంపిణీ చేస్తున్నాం. ప్రతి ఏటా ఖర్చు పెరిగినా పర్యావరణ పరిరక్షణ కోసం మా వంతు సహకారం అందిస్తున్నాం.

– అడ్డాల సత్యనారాయణ, ప్రముఖ దంత వైద్యుడు

ప్రతి ఏటా

మూడు వేల విగ్రహాల పంపిణీ

ప్రతి ఏటా మూడు వేల మట్టి విగ్రహాలు పంపిణీ చేస్తున్నాం. రంగులతో తయారుచేసిన విగ్రహాలు ఉపయోగించడం వల్ల నీరు కలుషితమవుతుంది. దీంతో అనేక జీవరాశులకు ఇబ్బంది కలుగుతుంది. అందుకే లయన్స్‌క్లబ్‌ ఆధ్వర్యంలో ప్రతి ఏటా గణపతి నవరాత్రి ఉత్సవాలకు ఉచితంగా మట్టి విగ్రహాలు పంపిణీ చేస్తున్నాం.

– బాదం బాలకృష్ణ, లయన్స్‌క్లబ్‌ మాజీ గవర్నర్‌

పర్యావరణాన్ని కాపాడుకోవాలి

పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజంలో అందరిపైనా ఉంది. రంగుల విగ్రహాల కారణంగా పర్యావరణానికి హాని కలుగుతుంది. అందుకే గత 20 సంవత్సరాలుగా శారద సేవాసమితి ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేస్తున్నాం. ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు కరపత్రాలు ద్వారా అవగాహన కల్పిస్తున్నాం.

– తోటకూర గంగాధర్‌, శారద సేవా సమితి సభ్యుడు, పీబీ దేవం, సామర్లకోట మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement