తుని రూరల్: తుని మండలం దొండవాక శివారు సీహెచ్.అగ్రహారానికి చెందిన రెండేళ్ల చిన్నారి సుంకర జ్ఙానేశ్వరి అదృశ్యమై 75 రోజులు గడిచినా నేటికీ ఆచూకీ లభించలేదు. అధికార యంత్రంగంతో పాటు తల్లిదండ్రులు సుంకర గణేష్, భవానీ, బంధువులు ఆమె ఆచూకీ కోసం చేయని ప్రయత్నం లేదు. తమ చిన్నారి ఎప్పటికై నా వస్తుందన్న ఆశతో ఆ తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. రోజులు గడిచిన తర్వాత గుర్తించేందుకు, తమ అనుబంధం, ఆప్యాయతలను గుర్తించేందుకు వీలుగా బుధవారం జాను పేరుతో యూట్యూబ్ చానల్‌ను ప్రారంభించినట్టు గణేష్, భవాని తెలిపారు. ఈ చానల్‌లో రెండేళ్లలో ఆమెతో ఉన్న ఫొటోలు, వీడియోలను అప్‌లోడ్ చేశారు. ఆ చానల్‌లో పెట్టిన ఫొటోలు చూసి ఆమె తన చెంతకు ఎప్పటికై నా రాకపోతుందా అనే ఆశతో ఉన్నట్టు వారు తెలిపారు. కాగా మంగళరం హైకోర్టు జ్ఞానేశ్వరి ఆచూకీపై ఆరా తీసి ఆమె దొరికే వరకు మరిన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది.


