సుమబాలకు శ్రావణ శోభ | - | Sakshi
Sakshi News home page

సుమబాలకు శ్రావణ శోభ

Aug 20 2026 12:17 AM | Updated on Aug 20 2026 12:17 AM

కడియం: శ్రావణమాసం రావడంతోనే మండలంలోని కడియపులంక పూవుల మార్కెట్‌కు కొత్త కళ సంతరించుకుంది. జనవరి నుంచి అంతంత మాత్రంగా సాగిన క్రయ విక్రయాలతో కళతప్పిన ఈ మార్కెట్‌ శ్రావణం నుంచి ప్రారంభమైన శుభ ముహూర్తాలతో సందడి నెలకొంది. శుక్రవారం వరలక్ష్మీవ్రతం నేపథ్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాతో పాటు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కొనుగోలుదారులతో స్థానిక మార్కెట్‌లో రద్దీ నెలకొంది.

దిగుబడి లేక దిగుమతి..

సీజన్‌ ప్రారంభమైనప్పటికీ స్థానికంగా పువ్వుల దిగుబడులు లేవని రైతులు చెబుతున్నారు. లిల్లీ, మల్లి, జాజులు, కనకాంబరం, దేశవాళీ గులాబీలు మాత్రమే ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. వరలక్ష్మీ వ్రతాలకు ప్రధానంగా వినియోగించే బంతి, చామంతులకు తీవ్రమైన కొరత ఏర్పడడంతో తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల నుంచి దిగుమతి చేస్తున్నారు. వాటి ధరలు సైతం అలాగే ఆకాశాన్నంటుతున్నాయని వ్యాపారులు అంటున్నారు.

బుధవారం పూల ధరలు ఇలా..

చామంతి కేజీ రూ.300–450

పసుపు బంతి రూ.80–100

ఆరెంజ్‌ బంతి రూ.90–110

లిల్లీ రూ.300,

మల్లి రూ.1200

జాజులు రూ.800

కాగడాలు రూ.1200

స్టార్‌ గులాబీ రూ.350–450

కనకాంబరాల బారు రూ.350–400

సంపంగి (వంద) రూ.1000

కడియపులంక మార్కెట్‌కు కొత్త కళ

శుభ ముహూర్తాల వేళ

జోరుగా విక్రయాలు

స్థానిక దిగుబడి లేక

ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి

డిమాండ్‌ మేరకు పెరుగుతున్న ధరలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement