ఫ నేడు జిల్లా వ్యాప్తంగా నిరసన ర్యాలీలు
ఫ వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు
దాడిశెట్టి రాజా
సాక్షి ప్రతినిధి, కాకినాడ: డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్ సీపీ చేపడుతున్న పోరాటం కొనసాగుతుందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా అన్నారు. నిరుద్యోగులు, విద్యార్థుల భవిష్యత్తు కోసం రాజీలేని పోరాటం చేస్తామన్నారు. ప్రభుత్వం చేస్తున్న అక్రమాలపై ప్రజలను ఎప్పటికప్పుడు చైతన్య పరుస్తున్నామని అన్నారు. దగా డీఎస్సీపై చేపట్టిన శాంతియుత రిలే నిరాహార దీక్షలను అడ్డుకోవడం, దీక్షా శిబిరాలపై దాడులు చేయడం, అక్రమ అరెస్టులకు పాల్పడటం చంద్రబాబు ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలకు నిదర్శనమన్నారు. రిలే దీక్షలు ముగిసినా.. కాకినాడ జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో విద్యార్థులు, యువత, నిరుద్యోగులు, ప్రజా సంఘాలు, ప్రజాస్వామ్య వాదులతో కలసి సోమవారం నిరసన ర్యాలీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ర్యాలీలో పార్టీ శ్రేణులతో పాటు యువత, విద్యార్థులు, నిరుద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వ విధానాలపై గళమెత్తుతారన్నారు. అక్రమాలకు బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలన్న డిమాండ్లతో ర్యాలీలు నిర్వహిస్తామన్నారు.


