బాలాజీచెరువు (కాకినాడ సిటీ): నేషనల్ కౌన్సెల్ ఫర్ సైన్స్ టెక్నాలజీ, శాస్త్ర సాంకేతిక మండలి నిర్వహించే 32వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ పోటీలను విజయవంతం చేయాలని డీఈఓ పిల్లి రమేష్ అన్నారు. ఈ మేరకు మంగళవారం తన చాంబర్‌లో ఆ పోటీలకు సంబంధించిన పోస్టర్లను జిల్లా సైన్స్ ఇన్‌చార్జి అధికారి కేసరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. డీఈఓ మాట్లాడుతూ ఈ ఏడాది వ్యర్థాల నిర్వహణ శక్తి, నీటి సంరక్షణ, ఆహారం, వ్యవసాయం, ఆరోగ్యం వంటి సమకాలీన అంశాలపై ప్రాజెక్టులు రూపొందించాలన్నారు. దీనిపై ఈ నెల 5, 6 తేదీల్లో డివిజనల్ స్థాయి సైన్స్ ఉపాధ్యాయులకు ఒరియంటేషన్ తరగతులు ఉంటాయన్నారు. కార్యక్రమంలో ఉప విద్యాశాఖాధికారులు, జిల్లా అకడమిక్ కో ఆర్డినేటర్ వెంకటరావు, రిసోర్స్ పర్సన్‌సుదర్శనబాబు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార
ప్రతినిధిగా మురళీకృష్ణంరాజు
ప్రత్తిపాడు రూరల్: వైఎస్సార్ సీపీ నరసాపురం పార్లమెంటరీ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజుకు పార్టీ అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించింది. ఆయనను వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమిస్తూ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన విడుదలైంది. ఈ సందర్భంగా ఆయనకు పలువురు నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు.
వైఎస్సార్ సీపీ పోరాటంతోనే సాగునీరు
ఫ మంత్రి రామానాయుడి
విమర్శలు హాస్యాస్పదం
ఫ వైఎస్సార్ సీపీ పిఠాపురం
కో ఆర్డినేటర్ వంగా గీతావిశ్వనాథ్
పిఠాపురం: నియోజకవర్గంలో రైతుల తరఫున వైఎస్సార్ సీపీ శ్రేణులు ఆందోళనకు దిగడం వల్లే ప్రభుత్వం దిగి వచ్చి ఏలేరు నుంచి సాగునీరు అందించిందని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి వంగా గీతా విశ్వనాథ్ అన్నారు. ఆమె మంగళవారం పిఠాపురంలో మాట్లాడుతూ సాగునీటి సమస్యతో సతమతమవుతున్న రైతుల వద్దకు వెళ్లే దమ్ము మంత్రి నిమ్మల రామానాయుడికి లేదని, కేవలం ఇతరుల మీద విమర్శలు చేయడం మాత్రం వచ్చని ఎద్దేవా చేశారు. కేవలం ఎదుటి వారిని విమర్శించడానికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చారని, వచ్చిన పనిని మాత్రం మర్చిపోయారని విమర్శించారు. వాస్తవానికి పిఠాపురం నియోజకవర్గంలో సాగునీరు రాదని, అపరాలు వేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు విస్తృతంగా ప్రచారం చేశారన్నారు. ఖరీఫ్ సీజన్‌లో వర్షాల సమయంలో అపరాలు సాగు చేసే టెక్నాలజీ ఏమైనా ఉందేమో చెప్పాలన్నారు. వైఎస్సార్ సీపీ పోరాటం చేయడం వల్లే రైతులకు సాగునీరు అందిందన్న విషయాన్ని కప్పిపుచ్చడానికి మంత్రి రామానాయుడు బాధ్యతారాహిత్యంగా విమర్శలు చేశారన్నారు. ఏరువాక పౌర్ణమి వెళ్లి నెల రోజులు దాటాక కాలువల్లో పువ్వులు జల్లడం విడ్డూరంగా ఉందన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో వైఎస్సార్ సీపీ శ్రేణులు రైతులకు అండగా ఉన్నాయన్నారు.
దివిసీమ గాంధీ సేవలు చిరస్మరణీయం
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): దివిసీమ గాంధీగా పేరొందిన మండలి వెంకట కృష్ణారావు తెలుగు భాషాభివృద్ధికి, సంస్కృతి పరిరక్షణకు జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అన్నారు. జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్‌లో మాజీ మంత్రి వెంకట కృష్ణారావు శత జయంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి కలెక్టర్ హరేంధిర ప్రసాద్, జేసీ అపూర్వ భరత్, ఇతర అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.


