పిఠాపురం: ఇప్పటి వరకు నీరు అందక నారు పోయలేదు. ఇప్పుడు నీరు వచ్చాక నారు లేదు. ఇదీ ఏలేరు పీబీసీ ఆయకట్టు పరిధిలో రైతుల పరిస్థితి. సాధారణంగా ఏటా సకాలంలో నీటిని విడుదల చేస్తే రైతులు నారును సిద్ధం చేసుకుంటారు. ఆ తర్వాత ఎప్పుడు నీరు వస్తే అప్పుడు నాట్లు వేసుకుంటారు. కానీ ఈ సారి కూటమి ప్రభుత్వం సాగునీరందించడంలో అవలంబించిన నిర్లక్ష్యధోరణి రైతులకు శాపంగా మారింది. అక్కడక్కడా తెగించి, చిన్నపాటి చినుకులు కురిసినప్పుడు నారుమళ్లు వేసినా అవి నీరందక ఎండిపోయాయి. ఇప్పుడు వరుణుడు కరుణించాడు. కాలువలకు నీరు విడుదలైంది. కానీ నాట్లు వేద్దామంటే నారు లేని పరిస్థితి ఏర్పడింది.
ఫ ఏలేరు పీబీసీ ఆయకట్టు రైతుల కష్టాలు
ఫ ఖరీఫ్ సాగుకు అవాంతరాలు


