● సర్పవరం.. జనసాగరం
జిల్లాలోనే ప్రసిద్ధి చెందిన సర్పవరం భావనారాయణ స్వామి ఆలయంలో మాఘ మాస ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. రథసప్తమి పర్వదినం, తొలి ఆదివారం కలసి రావడంతో వేలాదిగా తరలివచ్చిన భక్తులతో ఆలయం కిక్కిరిసిపోయింది. వేకువజామున ఐదు గంటల నుంచే వచ్చిన భక్తులు స్వామివారి సరస్సులో పుణ్యస్నానాలు ఆచరించారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు ఆవు పిడకలను నిచ్చెలిగా వేసి, నిప్పు పెట్టి, పాయసం తయారు చేసి, ప్రత్యక్ష దైవమైన సూర్యభగవానుడికి నివేదించారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా తరలి వచ్చిన భక్తులు భావనారాయణ స్వామిని దర్శించుకున్నారు. ఆలయ ఈఓ రాపాక శ్రీనివాసరావు పర్యవేక్షణలో భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఉచిత, ప్రత్యేక దర్శనాలు కల్పించారు. తిరునాళ్ల సందర్భంగా సర్పవరం జంక్షన్ నుంచి మాధవపట్నం వైపు వెళ్లే రోడ్డుపై ఏర్పడిన ట్రాఫిక్ సమస్యను పోలీసులు ఎప్పటికప్పుడు సరి చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ సుమారు 50 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారని ఈఓ తెలిపారు.
– కాకినాడ రూరల్
● సర్పవరం.. జనసాగరం
● సర్పవరం.. జనసాగరం


