ఉద్యమిస్తాం
ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంటు బకాయిలు విడుదల చేసేంత వరకూ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతాం. ఫీజు బకాయిలన్నింటినీ చెల్లిస్తామని విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థి సంఘాలకు ఇచ్చిన హామీ నేటి వరకూ నెరవేరలేదు. ఫీజుల విడుదలలో చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతున్నందున కళాశాలల యాజమాన్యాలు ఫీజులు చెల్లించాలంటూ విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నాయి.
– జి.చిన్ని, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు
చదువులెలా సాగుతాయి?
ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంటు చేయకపోతే పేద, మధ్య తరగతి విద్యార్థుల చదువులెలా సాగుతాయి? ఫీజుల చెల్లింపుపై చంద్రబాబు ప్రభుత్వం దృష్టి సారించకపోవడంతో విద్యారంగం ఒడుదొడుకులు ఎదుర్కొంటోంది. అనేక మంది విద్యార్థులు అష్టకష్టాలు పడుతున్నారు. 2024–25 విద్యా సంవత్సరంతో పాటు 2023–24 బకాయిలను కూడా ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి.
– బి.సిద్దూ, పీడీఎస్‌యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి
హామీలు మరిచారు
అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోపు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలన్నింటినీ విడుదల చేస్తామని యువగళం పాదయాత్రలో నారా లోకేష్ ఇచ్చిన హామీ నేటికీ నెరవేరలేదు. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న రూ.6,400 కోట్లు విడతల వారీగా విడుదల చేస్తున్నామని పత్రికా ప్రకటనలిస్తున్నారు, కానీ, ఇప్పటి వరకూ ఒక్క రూపాయ కూడా విడుదల చేయలేదు. ఫీజులు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని కూటమి నాయకులకు చెందిన అనేక కళాశాలల యాజమాన్యాలు తెగేసి చెబుతున్నాయి. దీంతో పేద విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, ఉపకార వేతనాలు విడుదల చేయాలి.
– ఎం.గంగా సూరిబాబు, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి
ఉద్యమిస్తాం
ఉద్యమిస్తాం


