మంగళవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 2026
జాతీయ జెండాను ఆవిష్కరిస్తున్న
ఇన్‌చార్జి కలెక్టర్ అపూర్వ భరత్. చిత్రంలో
ఎస్పీ బిందుమాధవ్
ప్రజల సహకారంతో
ప్రగతి గీతిక
మేరా భారత్ మహాన్: ఆకట్టుకున్న విద్యార్థుల ప్రదర్శన
జయహో భారత్: అలరించిన
విద్యార్థినుల విన్యాసం
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): ప్రజల సహకారంతో జిల్లాను మరింత అభివృద్ధి చేస్తానని ఇన్‌చార్జి కలెక్టర్ అపూర్వ భరత్ అన్నారు. దేశ 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో సోమవారం ఆయన జాతీయ జెండాను ఎగురవేసి, సాయుధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశ సమైక్యత, ప్రగతి కోసం ప్రజలందరూ జాతి, కుల, మత, ప్రాంతీయ భేదాలు లేకుండా మంచి పౌరులుగా జీవనం సాగించాలని, విధులు, బాధ్యతలను అంకిత భావంతో పాటించాలని పిలుపునిచ్చారు. దేశ ప్రజలందరికీ రాజ్యాంగం సమాన హక్కులు, అవకాశాలను కల్పించిందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా జిల్లా ప్రగతిని ఆయన వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
ప్రస్తుత రబీలో ఇప్పటి వరకూ రూ.4,830 కోట్ల పంట రుణాలు, రూ.3,520 కోట్ల టర్మ్ లోన్లను రైతులకు అందించాం. 9,660 మంది కౌలు రైతులకు రూ.160 కోట్ల రుణాలుగా మంజూరు చేశాం. అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం ద్వారా ఈ ఏడాది 1.51 లక్షల రైతు కుటుంబాలకు రూ.202 కోట్ల పెట్టుబడి సాయం జమ చేశాం. రూ.17.64 కోట్ల సబ్సిడీతో 1,800 హెక్టార్లలో బిందు, తుంపర సేద్య పరికరాలు ఏర్పాటు చేయాలన్నది లక్ష్యం కాగా, ఇప్పటి వరకూ 682 మంది రైతులకు చెందిన 789 హెక్టార్లలో వీటిని ఏర్పాటు చేశాం.
డాక్టర్ ఎన్‌టీఆర్ వైద్య సేవా పథకం కింద ఈ ఏడాది ఇప్పటి వరకూ రూ.166 కోట్ల విలువైన 96,807 చికిత్సలను ఉచితంగా అందించాం.
ఎస్సీ కార్పొరేషన్, డీఆర్‌డీఏల సమన్వయంతో పీఎం అజయ్ – ఉన్నతి కార్యక్రమం ద్వారా రూ.2.47 కోట్ల విలువైన 172 ఆదాయ ఉత్పత్తి యూనిట్లను ఎస్సీ డ్వాక్రా మహిళలకు పంపిణీ చేస్తున్నాం. బీసీ, ఈబీసీ, కాపు సామాజిక వర్గాలకు చెందిన 4,920 మంది మహిళల స్వయం ఉపాధికి బీసీ కార్పొరేషన్ ద్వారా 50 ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాలు నిర్వహిస్తున్నాం.
కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ పి.చంద్రమౌళి, జిల్లా ఎస్పీ బిందుమాధవ్, జిల్లా అటవీ అధికారి ఎన్.రామచంద్రరావు, అసిస్టెంట్ కలెక్టర్ మనీషా, ఏఎస్పీ మనీష్ పాటిల్ దేవరాజ్, ఏఆర్ అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు, డీఆర్‌ఓ జె.వెంకటరావు పాల్గొన్నారు.
జాతి, కుల, మత, ప్రాంతీయ భేదాలు మరచి జీవించాలి
ప్రజలకు ఇన్‌చార్జి కలెక్టర్
అపూర్వ భరత్ విజ్ఞప్తి
ఘనంగా గణతంత్ర వేడుకలు
పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో
జాతీయ జెండా ఆవిష్కరణ
గణతంత్రం.. కడురమ్యం
గణతంత్ర వేడుకల సందర్భంగా కాకినాడలోని పోలీస్ పరేడ్ మైదానంలో సాయుధ దళాల కవాతు ఆకట్టుకుంది. ఆర్మ్‌డ్ రిజర్వ్, ట్రాఫిక్ పోలీస్, వుమెన్ కంటింజెంట్, క్విక్ రియాక్షన్ టీం, హోం గార్డు, ఎన్‌సీసీకి సంబంధించి 18, 3వ ఆంధ్రా బెటాలియన్లు, 6 ఆంధ్ర నావెల్, 9 ఆంధ్ర ఎయిర్‌ఫోర్స్‌తో పాటు, రెడ్‌క్రాస్ దళాలు సంప్రదాయ కవాతు నిర్వహించాయి. ఆర్మ్‌డ్ రిజర్వ్ పోలీస్ ప్రథమ, క్విక్ రియాక్షన్ టీం ద్వితీయ, వుమెన్ కంటింజెంట్‌లకు తృతీయ బహుమతులు లభించాయి. ఎన్‌సీసీ నుంచి 3వ ఆంధ్రా బెటాలియన్, ఎయిర్‌ఫోర్స్, రెడ్‌క్రాస్ కంటింజెంట్లకు ఇన్‌చార్జి కలెక్టర్ అపూర్వ భరత్, ఎస్పీ బిందుమాధవ్ అవార్డులు అందజేశారు.
శకటాల ప్రదర్శన
ఈ వేడుకల్లో అన్నవరం దేవస్థానం, గృహ నిర్మాణం, పాఠశాల విద్య, వైద్య, ఆరోగ్యం, 108, 104, తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్, జిల్లా నీటి యాజమాన్య సంస్థ, అటవీ శాఖలు తమ పథకాలపై శకటాలను ప్రదర్శించాయి. గృహ నిర్మాణ శాఖ ప్రథమ, పాఠశాల విద్యాశాఖ ద్వితీయ, వైద్య, ఆరోగ్య శాఖ తృతీయ బహుమతలు అందుకున్నాయి.
మంగళవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 2026
మంగళవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 2026
మంగళవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 2026
మంగళవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 2026
మంగళవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 2026
మంగళవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 2026


