ట్రావెల్స్ బస్ ఢీకొని యువకుడి మృతి
ప్రత్తిపాడు: స్థానిక జాతీయ రహదారిపై పోలవరం కాలువ వంతెన సమీపాన ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ఢీకొనడంతో యువకుడు మృతి చెందిన సంఘటన సోమవారం సాయంత్రం జరిగింది. స్థానిక పోలీసుల కథనం మేరకు జగ్గంపేట మండలం తాళ్లూరు గ్రామానికి చెందిన తలారి రవి (26) బైక్‌పై ప్రత్తిపాడు వచ్చి తిరిగి స్వగ్రామం వెళ్తుండగా పోలవరం కాలువ వంతెన సమీపానికి వచ్చే సరికి తుని నుంచి రాజమహేంద్రవరం వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్ వెనుక నుంచి ఢీకొనడంతో తలారి రవి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రత్తిపాడు సీహెచ్‌సీకి తరలించారు. స్థానిక ఎస్సై ఎస్.లక్ష్మీకాంతం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


