గ్రూప్–2 ఫలితాలలో ‘శ్యామ్’ సంచలనం
బోట్‌క్లబ్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బుధవారం విడుదల చేసిన గ్రూప్–2 ఫలితాల్లో కాకినాడ శ్యామ్ ఇనిస్టిట్యూట్ తమ మొదటి ప్రయత్నంలో సంచలన విజయాలతో విజయకేతనాన్ని ఎగురవేసిందని సంస్థ చైర్మన్ శ్యామ్ తెలిపారు. 89 మంది తమ సంస్థ విద్యార్థులు డిప్యూటీ తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్, ఎకై ్సజ్ సబ్–ఇన్‌స్పెక్టర్ తదితర అత్యున్నత స్థాయి ఉద్యోగాలు సాధించారన్నారు. 2025 డీఎస్సీ ఫలితాలలో కూడా మొదటి ప్రయత్నంలోనే 712 ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించడం, ఏపీ టెట్–2026 ఫలితాలలో అత్యధిక మార్కులతో 186 మంది క్వాలిఫై కావడం, ఇప్పుడు విడుదలైన గ్రూప్–2 ఫలితాలలో ఇన్ని విజయాలు సాధించడానికి ప్రధాన కారణం తమ సంస్థలో నిబద్ధత, క్రమశిక్షణతో కూడిన శిక్షణ, ప్రామాణికమైన స్టడీ మెటీరియల్, టెస్ట్ సిరీస్‌లేనని ఆయన తెలిపారు. ఇంతటి అద్భుతమైన ఫలితాలను సాధించడంలో సహకరించిన విద్యార్థులకు, తల్లిదండ్రులకు హృదయపూర్వక శుభాకాంక్షలు, అధ్యాపక, అధ్యాపకేతర బృందానికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఏపీపీఎస్సీ గ్రూప్–2, డీఎస్సీ, సబ్ ఇన్‌స్పెక్టర్లు, కానిస్టేబుళ్లు నూతన బ్యాచ్‌లు ఫిబ్రవరి 12న ప్రారంభం కానున్నాయని, విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని రాబోయే నోటిఫికేషన్లలో విజయాన్ని సాధించాలని ఆకాంక్షించారు.


