అన్నదానానికి పెంకుటిల్లు విరాళం
దానం చేసిన భక్తురాలు
రామచంద్రపురం రూరల్: దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న ద్రాక్షారామ మాణిక్యాంబ సమేత భీమేశ్వరస్వామి ఆలయ అన్నదాన ట్రస్ట్‌కు ఏలూరు జిల్లా నూజివీడుకు చెందిన దాత చిలకమర్రి వైజయంతి తనకు చెందిన 104 చదరపు గజాల పెంకుటిల్లును తన తదనంతరం అన్నదాన ట్రస్ట్‌కు చెందేలా వీలునామా రాశారు. ఈ మేరకు ఆలయ ఈఓ, దేవదాయ శాఖ సహాయ కమిషనర్ అల్లు వెంకట దుర్గాభవానికి బుధవారం ఆ పత్రాలను అందజేశారు. 75 ఏళ్ల వయస్సు కలిగిన తనకు సంతానం లేకపోవడం, భర్త చిలకమర్రి సత్య సారధి ఇప్పటికే మృతి చెందడంతో స్వామివారి సేవకు తన ఇల్లు ఉపయోగపడాలని విల్లు రాసి ఇచ్చినట్టు ఆమె పేర్కొన్నారు. ఈఓ ఆమెకు స్వామివారి జ్ఞాపిక ఇచ్చి అభినందించారు.


