వృత్తిని వదులుకోవాల్సిన పరిస్థితి
గతంలో మాదిరిగా గంగిరెద్దుల ప్రదర్శనకు ఆదరణ అంతగా ఉండడం లేదు. కుల వృత్తిని వీడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రభుత్వం గంగిరెద్దుల సామాజిక వర్గాన్ని గుర్తించి ఆర్థికంగా ఆదుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడే ఈ వృత్తిని కొనసాగించగలం.
–బొడ్డు రాజు,
పసలపూడి, రాయవరం మండలం
పండగ సమయంలోనే..
ఒకప్పుడు అన్ని కాలాల్లో గంగిరెద్దుల ఆటను ప్రతి ఒక్కరూ ఆదరించేవారు. ఇప్పుడు కేవలం సంక్రాంతి సమయంలోనే ఆట ఉంటుంది. ఆదరణ తగ్గుతుండడంతో యువత ఈ వృత్తిని స్వీకరించడం లేదు. ప్లాస్టిక్ సామాన్లు అమ్ముకునేందుకు, కూలి పనులకు వెళ్లిపోతున్నారు.
–బొడ్డు ప్రకాష్, కందరాడ,
పిఠాపురం మండలం
ఆర్థికంగా ఆదుకోవాలి
గంగిరెడ్ల సామాజిక వర్గం అనాది నుంచి సంచార జాతి ఉంటుంంది. ఒక జిల్లా నుంచి వేరే జిల్లాకు వెళ్లి గంగిరెద్దులను ఆడించుకుని పోషణ పొందుతున్నాం. ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోకుంటే మా జీవితాలు ఏ విధంగా అభివృద్ధి చెందుతాయి.
–జానపాటి ఏసు, మాధవపట్నం,
కాకినాడ రూరల్
ఎస్టీ జాబితాలో చేర్చాలి
ఊరూరా తిరుగుతూ ఉండే సంచార జాతులమైన గంగిరెడ్ల సామాజిక వర్గాన్ని ఎస్టీ జాబితాలో చేర్చాలి. ఇప్పటికీ అధిక సంఖ్యలో ఉన్న గంగిరెడ్ల సామాజిక వర్గానికి కనీసం పక్కా ఇళ్లు లేవు. వృత్తి కూడు పెట్టకపోవడంతో చిన్న చిన్న సామాన్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాం.
–బొమ్మన పరంజ్యోతి, అధ్యక్షుడు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గంగిరెడ్ల సంక్షేమ సంఘం
వృత్తిని వదులుకోవాల్సిన పరిస్థితి
వృత్తిని వదులుకోవాల్సిన పరిస్థితి
వృత్తిని వదులుకోవాల్సిన పరిస్థితి


