కాకినాడలో బిగ్‌బాస్ విజేత సందడి
బోట్‌క్లబ్ (కాకినాడ): స్థానిక శ్యామ్ ఇనిస్టిట్యూట్‌లో బిగ్‌బాస్ సీజన్– 9 విజేత, భారతదేశ సైనికుడు కళ్యాణ్ పడాల సందడి చేశారు. ఆ సంస్థతో జ్ఞాపకాలను నెమర వేసుకుంటూ, తన ఎదుగుదలలో శ్యామ్ ఇనిస్టిట్యూట్ పాత్రను ఆయన కొనియాడారు. బిగ్‌బాస్ ట్రోఫీతో విచ్చేసిన కళ్యాణ్ పడాలకు ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ శ్యామ్ సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై కళ్యాణ్ మాట్లాడుతూ ఈ ఇనిస్టిట్యూట్ విద్యార్థిగా నేర్చుకున్న క్రమశిక్షణ, పట్టుదలే తనను ఈ స్థాయిలో నిలబెట్టాయన్నారు. బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు కూడా ఇక్కడ నేర్చుకున్న పాఠాలు ధైర్యాన్ని ఇచ్చాయని భావోద్వేగంతో వివరించారు. శ్యామ్ ఇనిస్టిట్యూట్ అధినేత గుంటూరు శ్యామ్ మాట్లాడుతూ ఇనిస్టిట్యూట్ విద్యార్థిగా కళ్యాణ్ ఎంతో అంకితభావంతో ఉండేవారన్నారు. అనంతరం కళ్యాణ్‌ను సత్కరించారు.
పోటీ పరీక్షలకు కేరాఫ్ అడ్రస్‌గా..
పోటీ పరీక్షలకు శ్యామ్ ఇనిస్టిట్యూట్ కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిందని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ అన్నారు. స్థానిక శ్యామ్ ఇనిస్టిట్యూట్ ఆవరణలో కొత్తగా ఏర్పాటు చేసిన ఫిజికల్ ఈవెంట్ గ్రౌండ్‌ను ఎంపీతో పాటు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ ప్రారంభించారు. ఎంపీ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన అన్ని రకాల పోటీ పరీక్షల్లో శ్యామ్ ఇనిస్టిట్యూట్ అగ్రగామిగా నిలవాలని ఆకాంక్షించారు. అడిషనల్ ఎస్పీ ఎ.శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతున్న శ్యామ్ ఇనిస్టిట్యూట్ అధినేత శ్యామ్‌ను అభినందనీయులన్నారు. కార్యక్రమంలో ఇనిస్టిట్యూట్ అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.


