● మంచి మార్కులకు దోహదం
దస్తూరి అందంగా ఉంటేనే మంచి మార్కులు వస్తాయి. ప్రజెంటేషన్ బాగా చేయడానికి దస్తూరి ఒక కారణంగా చెప్పవచ్చు. ఏకాగ్రతతో 10 రోజులు సాధన చేస్తే కచ్చితంగా అద్భుతమైన చేతిరాతను సొంతం చేసుకోవచ్చు. వేల మందికి చేతిరాతను తీర్చిదిద్దడంలో తర్ఫీదునిచ్చాను.
–కుంచే బాలకృష్ణ, కాలిగ్రాఫర్, స్కూల్ అసిస్టెంట్ (బయాలజీ), జెడ్పీహెచ్‌ఎస్,
తొండవరం
● మెళకువలు నేర్చుకోవాలి
చేతిరాతను అందంగా తీర్చిదిద్దుకోవాలంటే కొన్ని మెళకువలు తప్పనిసరిగా పాటించాలి. పెన్ను పట్టుకునే విధానం కూడా చేతిరాతను మారుస్తుంది. ప్రతి రోజూ కొంత సమయాన్ని చేతిరాతను తీర్చిదిద్దుకునేందుకు కేటాయించాలి. చేతిరాత బాగుంటే తలరాత కూడా మారుతుంది.
–టి.గణేశ్వరరావు, హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవర్, స్కూల్ అసిస్టెంట్ (హిందీ), కాండ్రకోట,
పెద్దాపురం మండలం
● తప్పుల్లేకుండా రాయాలి
అందమైన అక్షరాలతో మంచి మార్కులను సంపాదించవచ్చు. చేతిరాత మెరుగుపర్చేందుకు విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాం. సమాధానాలు దిద్దేవారికి సులభంగా అర్థమైనప్పుడే మంచి మార్కులకు అవకాశం ఉంటుంది. తక్కువ రాసినా తప్పుల్లేకుండా అందంగా రాయడం వల్ల మంచి మార్కులు సాధించవచ్చు.
–సీహెచ్ జాన్‌ప్రసాద్, జెడ్పీ హైస్కూల్ హెచ్‌ఎం, ప్రత్తిపాడు
● మంచి మార్కులకు దోహదం
● మంచి మార్కులకు దోహదం


