
మాల కార్పొరేషన్ చైర్మన్‌కు ప్రొటోకాల్ పాటించరా?
కాకినాడ సిటీ: జిల్లాకు వచ్చిన మాల కార్పొరేషన్ చైర్మన్ విజయ్‌కుమార్‌కు ప్రభుత్వ యంత్రాంగం ప్రొటోకాల్ పాటించని కారణంగా మాల సంఘ నాయకులు సమావేశాన్ని బాయ్‌కట్ చేశారు. కాకినాడ జిల్లా ఎస్సీ కార్పొరేషన్ (డీఆర్‌డీఏ సమావేశపు హాలు)లో మంగళవారం మాల కార్పొరేషన్ చైర్మన్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి జిల్లాలో ఉన్న నాయకులకు, ఉద్యమకారులకు సరైన సమాచారం అందించలేదని మాల సంఘ నాయకులు విమర్శించారు. ఒక కార్పొరేషన్ చైర్మన్ వచ్చినప్పుడు పాటించవలసిన ప్రొటోకాల్‌ను పట్టించుకొనకపోవడం విచిత్రంగా ఉందని ఎస్సీ నాయకులు విమర్శించారు. చైర్మన్ వచ్చినప్పుడు కలెక్టర్‌గాని, ప్రభుత్వ అధికారులుకానీ ఉండాలి అలా కాకుండా సాధారణమైన వ్యక్తులను చూసినట్లుగా సమావేశాలు నిర్వహించడం సమంజసం కాదన్నారు. కలెక్టర్ సమక్షంలో సమావేశం నిర్వహించాలని అప్పటి వరకు ఎస్సీ నాయకులంతా సమావేశాన్ని బాయ్‌కట్ చేస్తున్నామంటూ ప్రకటించి నిరసన వ్యక్తం చేశారు. నిర్లక్ష్యం వహించిన ప్రభుత్వ అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాల సంఘాల నాయకులు మాట్లాడుతూ మాల కార్పొరేషన్ చైర్మన్‌ను తాము వ్యతిరేకించడం లేదని, కలెక్టర్ ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడం దారుణమన్నారు. కనీసం పోలీసులు గానీ, అధికారులు కానీ హాజరు కాకపోవడం అవమానించడమేనని వివరించారు. నాయకులు తోటి చంగల్‌రావు, సిద్దాంతుల కొండబాబు, ఏనుగుపల్లి కృష్ణ, వుల్లం రవి, బోని సంజయ్‌కుమార్, మాతా సుబ్రహ్మణ్యం, ఖండవిల్లి లోవరాజు, రాగులు రాఘవులు, బొజ్జ ఐశ్వర్య, పెదపాక గురునాధం, దౌర్ల చిట్టిబాబు పాల్గొన్నారు.
సమావేశాన్ని బాయ్‌కట్ చేసిన నాయకులు