
తొలి తిరుపతికి తండోపతండాలుగా..
శృంగార వల్లభుని ఆదాయం రూ.2.38 లక్షలు
పెద్దాపురం: తొలి తిరుపతి స్వయంభూ శృంగార వల్ల భుని ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. ఆల య ఈఓ వడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందుల తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. అర్బకులు పెద్దింటి నారాయణాచార్యు లు, పురుషోత్తమాచార్యులు స్వామి వారిని పూలమాలలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ సేవల టిక్కెట్లు, అన్నదానం, కేశ ఖండన ద్వారా స్వామి వారికి రూ.2,38,048 ఆదాయం సమకూరినట్లు ఈఓ తెలిపారు. సుమా రు 15 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకోగా 3,500 మంది భక్తులకు అన్నదానం ఏర్పాటు చేసినట్లు ఈఓ శ్రీనివాస్ తెలిపారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు పెద్దింటి పురుషోత్తమాచార్యులు, నారాయణాచార్యులు, గ్రామ సర్పంచ్ మొయిళ్ల కృష్ణమూర్తి ఆలయ సిబ్బంది అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ఉద్యోగులకు అండగా ఏపీజీఈఏ
అమలాపురం టౌన్: ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీఈఏ) ఎప్పుడూ అండగా ఉంటుందని జిల్లా శాఖ అధ్యక్షుడు మద్దాల బాపూజీ అన్నారు. అమలాపురంలోని ముక్తేశ్వరం రోడ్డులో తాలూకా శాఖ అధ్యక్షుడు కె.కామేశ్వరరావు అధ్యక్షతన ఏపీజీఈఏ వ్యవస్థాపక దినోత్సవాన్ని శనివారం ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా బాపూజీ మాట్లాడుతూ జిల్లాలోని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఏపీజీఈఏ చేస్తున్న కృషిని వివరించారు. ప్రభుత్వంచే గుర్తింపు పొందిన సంఘంగా ఏర్పడిన అనతి కాలంలోనే రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగుల సభ్యత్వం కలిగిన ఏకై క సంఘంగా సేవలు అందిస్తోందన్నారు. అనంతరం నాయకులు కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకొన్నారు. పీఆర్‌సీ కమిషన్ ఏర్పాటు చేయాలని, పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏ బిల్లులు ఇవ్వాలని, ఉద్యోగులకు రూ.25 వేల కోట్ల బకాయిలు చెల్లించాలని సమావేశం డిమాండ్ చేసింది. సంఘ జిల్లా కోశాధికారి జేఏ రాజ్‌కుమార్, నాయకులు లక్ష్మణ్‌కుమార్, సూర్యనారాయణ, రాజు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
నేడు గుళ్లపల్లి ఘనపాఠికి రాజాలక్ష్మి పురస్కారం ప్రదానం
రాజమహేంద్రవరం రూరల్: రాజమహేంద్రవరం శివారు కొంతమూరులోని దత్తాత్రేయ వేదవిద్య గురుకులం గౌరవాధ్యక్షుడు, ప్రధాన ఆచార్యుడు గుళ్లపల్లి సీతారామచంద్ర ఘనపాఠి మరో ప్రతిష్టాత్మక అవార్డు అందుకోనున్నారు. చైన్నెకి చెందిన రమణయ్య రాజా 1979 నుంచి వివిధ రంగాల్లో నిష్ణాతులకు రాజాలక్ష్మి అవార్డులను అందజేస్తున్నారు. ఈ మేరకు వేదవిద్య ప్రచారానికి గుళ్లపల్లి ఘనపాఠి చేస్తున్న కృషికి గుర్తింపుగా ఆదివారం ఉదయం 11.30 గంటలకు వేదవిద్య గురుకులం ప్రాంగణంలో ఈ అవార్డును అందజేయనున్నారు. సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తారు. సంస్థ రజతోత్సవ సందర్భంలో ఈ అవార్డును అందుకోవడం దత్తాత్రేయుని ఆశీస్సులుగా భావిస్తున్నానని సీతారామచంద్ర ఘనపాఠి తెలిపారు. గురుకులం కార్యవర్గం తరఫున భాగవత విరించి డాక్టర్ టీవీ నారాయణరావు ఈ వివరాలు తెలిపారు.
శ్రీఖండ్ కై లాష్ మహాదేవ్ యాత్ర
బిక్కవోలు: మండలంలోని కొంకుదురు చెందిన నలుగురు యువకులు శ్రీఖండ్ కై లాష్ మహాదేవ్ యాత్ర పూర్తి చేసుకుని స్వగ్రామానికి వచ్చారు. పంచ కై లాసాలలో ఒకటిగా భావించే ఈ ప్రదేశం హిమాచల్ ప్రదేశ్‌లో సముద్ర మట్టానికి 18,570 అడుగుల ఎత్తులో ఉంది. పోతంశెట్టి మదన్‌రెడ్డి ఆధ్వర్యంలో చిన్నం వెంకటరెడ్డి, మల్లిడి సురేంద్రరెడ్డి, కర్రి ఉమామహేశ్వరరెడ్డి, పడాల వెంకటరెడ్డి ఈ యాత్రను చేసి 72 అడుగుల పర్వత లింగాన్ని దర్శించుకున్నారు.

తొలి తిరుపతికి తండోపతండాలుగా..

తొలి తిరుపతికి తండోపతండాలుగా..

తొలి తిరుపతికి తండోపతండాలుగా..