పూజలు చేసి ప్రారంభించిన
ఆలయ వర్గాలు
అన్నవరం: రత్నగిరి శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానానికి అరబిందో ఫార్మాస్యూటికల్స్ రూ.32 లక్షలు విలువ చేసే బస్సును శుక్రవారం అందచేసింది. డీజిల్‌తో నడిచే ఈ బస్సులో 44 మంది భక్తులు ప్రయాణించవచ్చునని అధికారులు తెలిపారు. దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు ఈ బస్సుకు లాంఛనంగా పూజలు చేసి ప్రారంభించారు.
వన దుర్గమ్మకు చండీహోమం
అన్నవరం: రత్నగిరి వనదేవత వనదుర్గ అమ్మకు శుక్రవారం చండీ హోమం ఘనంగా ఘనంగా నిర్వహించారు. అలాగే ప్రధానాలయంలోని సత్యదేవుని దేవేరి అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారికి, కొండదిగువన తొలి పావంచా వద్ద కొలువైన కనకదుర్గ అమ్మవారికి పండితులు కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించారు. ఉదయం తొమ్మిది గంటలకు పండితులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన చండీహోమం ప్రారంభించారు. అనంతరం 11 గంటలకు పూర్ణాహుతి నిర్వహించారు. తరువాత అమ్మవార్లకు వేద పండితులు వేదాశీస్సులు, నీరాజన మంత్రపుష్పాలు సమర్పించి ప్రసాదాలు నివేదించారు. అమ్మవారికి నిర్వహించిన హోమంలో 42 మంది భక్తులు పాల్గొన్నారు. సత్యదేవుని ప్రధాన ఆలయంలో దేవేరి అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారికి ప్రధానార్చకుడు కోట సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో, కనకదుర్గ అమ్మవారికి పరిచారకుడు ప్రసాద్ ఆధ్వర్యంలో పండితులు కుంకుమ పూజలు నిర్వహించి నీరాజనమంత్రపుష్పాలు సమర్పించారు. అనంతరం ప్రసాదాలు నివేదించి భక్తులకు పంపిణీ చేశారు.
సీ్త్ర శక్తి పథకాన్ని
సద్వినియోగం చేసుకోవాలి
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): సీ్త్ర శక్తి పథకాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ షణ్మోహన్ అన్నారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ఆయన ఎంపీలు సానా సతీష్ బాబు, తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు, పంతం నానాజీలతో కలసి జెండా ఊపి మహిళల ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించారు. జిల్లాలో ఈ పథకానికి 177 బస్సులను కేటాయించినట్టు తెలిపారు.
బడుగు వర్గాలపై
‘కూటమి’ కక్ష సాధింపు
ముమ్మిడివరం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి బడుగు వర్గాలపై కక్ష సాధింపు చేస్తుందని వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి కాశి రామకృష్ణ ఆరోపించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ 20 ఏళ్ల నుంచి పింఛన్లు పొందుతున్న లబ్ధిదారులను తొలగించారని, వాటిలో వితంతువులు కూడా ఉన్నారన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్క పింఛను కూడా ఇవ్వకుండానే ఉన్నవాటిని తొలగించడం దారుణమన్నారు. విద్యుత్ బిల్లులు, ఇతర కారణాలతో అర్హులకు తల్లికి వందనం ఇవ్వకుండా మోసం చేశారన్నారు. కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రజలకు దూరం చేసిందని అన్నారు.
రత్నగిరికి అరబిందో బస్సు
రత్నగిరికి అరబిందో బస్సు