
శ్రీదేవీ శరణు శరణు
అమలాపురం టౌన్: అమలాపురం శ్రీదేవి మార్కెట్‌లోని శ్రీదేవి ఆలయంలో గాజుల గౌరీదేవీగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారిని సుమారు 50 వేల గాజులతో అలంకరించారు. వేలాది మంది మహిళలు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.అలాగే ఆలయాన్ని గాజుల దండలతో ముస్తాబు చేశారు. తెల్లవారు జాము నుంచి రాత్రి వరకూ ఆలయం భక్తులతో పోటెత్తింది. రాత్రి గాజులను భక్తులకు పంచిపెట్టారు. ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ గంగాబత్తుల రాంబాబు, కమిటీ ప్రతినిధులు, మాజీ కౌన్సిలర్లు మామిడిపల్లి రాము, ఆశెట్టి ఆదిబాబు తదితరులు సేవలు అందించారు.