
పారిశుధ్య కార్మికులకు సర్పంచ్ సత్కారం
కాకినాడ రూరల్: గ్రామం పరిశుభ్రంగా ఉంటే గ్రామస్తులు ఆరోగ్యంగా ఉంటారని నమ్మే తిమ్మాపురం పంచాయతీ సర్పంచ్ బెజవాడ సత్యనారాయణ ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఎప్పటిలాగే గ్రామంలోని పారిశుధ్య కార్మికుల కాళ్లు కడిగి సత్కరించారు. 2002లో మొదటిసారి సర్పంచ్‌గా ఎన్నికై న నాటి నుంచి ఈ కార్యక్రమాన్ని ఆయన కొనసాగిస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం తిమ్మాపురం పంచాయతీ వద్ద జాతీయ జెండా ఎగరవేసి గౌరవ వందనం సమర్పించి అనంతరం కార్మికులకు శాలువా, పూలమాల వేసి సత్కరించారు. వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడైన సత్యనారాయణ చేస్తున్న ఈ కార్యక్రమాన్ని పలువురు అభినందించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రామన్న చౌదరి, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రజారోగ్యమే లక్ష్యంగా 15 ఏళ్లుగా నిర్వహణ