
ఆకట్టుకున్న శకటాలు
జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన 8 శకటాలు ఆయా విభాగాల్లో అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రగతిని ప్రతిబింబించాయి. తొలుత దేవదాయశాఖ ఆధ్వర్యంలో అన్నవరం వీర వేంకట సత్యనారాయణ స్వామి ఆలయ శకటాన్ని ప్రదర్శించగా ఆలయ అర్చకులు, వేద పండితులు ఉప ముఖ్యమంత్రికి వేదాశీర్వచనాలు అందజేశారు. అనంతరం వరుసగా సీ్త్ర శక్తి పథకం ప్రజా రవాణా శాఖ, విద్యా శాఖ తల్లికి వందనం, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం తదితర శకటాలను ప్రదర్శించారు. వాటిలో జిల్లా విద్యాశాఖ శకటం ప్రథమ బహుమతిని దక్కించుకోగా, జీరో పావర్టీ పీ4 ద్వితీయ, పిఠాపురం ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (పాడా) శకటం తృతీయ బహుమతిని దక్కించుకున్నాయి.

ఆకట్టుకున్న శకటాలు