
● రెండు డజన్ల అడుగుల ఎత్తు.. ఈ అరటి చెట్టు
మలికిపురం: రెండు డజన్లు.. అరటి పండ్లు కావు.. అన్ని అడుగుల ఎత్తున పెరిగిన అరటి చెట్టు ఇది. మలికిపురం మండలం గొల్లపాలెం గ్రామంలో రైతు మట్టా శ్రీనివాసరావు ఇంటి పెరట్లో వేసిన అరటి చెట్టు అమాంతం అంత ఎత్తున ఎదిగింది. సాధారణంగా అరటి చెట్లు 15 అడుగులకు మించి పెరగవు. ఈ చెట్టు ఏకంగా 24 అడుగుల ఎత్తు ఎదగడంతో చూపరులు విస్తుపోతున్నారు. ఈ అరటి విత్తనం పేరు బూడిత పక్కీస్ అంటారని, విజయనగరంలోని స్నేహితుల ఇంటి నుంచి తెచ్చినట్లు శ్రీనివాసరావు తెలిపారు. దీని పండ్లు కూడా సాధారణ చక్కెర కేళీ కంటే భారీ సైజులో ఉంటాయన్నారు. ఈ మొక్క వేసిన చోట చుట్టుపక్కల ఇతర మొక్కలను ఎదగనీయదు. మొత్తం నేల ధాతువులను వినియోగించుకోవడమే ఇలా ఎత్తుగా ఎదగడానికి కారణం.
గొల్లపాలెంలో 24 అడుగుల
అరటి చెట్టు వద్ద శ్రీనివాసరావు