
ఏపీఎస్పీ సిబ్బందికి ఉగాది పురస్కారాలు
కమాండెంట్ నాగేంద్రరావుకు మహోన్నత సేవా పతకం
కాకినాడ రూరల్: కాకినాడ ఏపీఎస్పీ మూడవ బెటాలియన్ ప్రస్తుత కమాండెంట్ ఎం.నాగేంద్రరావుకు రాష్ట్ర ప్రభుత్వ ఉగాది మహోన్నత సేవా పతకం లభించింది. ఏపీ పోలీసు అండ్ ఫైర్ సర్వీసు పతకాలు– సేవా పతకాలను ఉగాది – 25కు శుక్రవారం ప్రకటించింది. నాగేంద్రరావు అక్టోపస్ ఎస్పీ (ఆపరేషన్స్ అండ్ అడ్మిన్)గా పనిచేసి ఇటీవల ఏపీఎస్సీ 3వ బెటాలియన్‌కు వచ్చారు. అక్టోపస్ ఎస్పీగా అందించిన సేవలకు గాను ఆయనకు ఉగాది పురస్కారం లభించింది.
13 మంది ఏపీఎస్పీ బెటాలియన్ సిబ్బందికి పురస్కారాలు
కాకినాడ ఏపీఎస్పీ 3వ బెటాలియన్ సిబ్బంది 13మందికి పతకాలు వరించాయి. అడిషనల్ కమాండెంట్ దేవానందరావు, అసిస్టెంట్ కమాండెంట్ బి.శ్రీనివాస బాబ్జీ ఉత్తమ సేవా పతకాలు పొందారు. కఠిన సేవా పతకం హెచ్‌సీ బీవీ అప్పన్న, సేవా పతకాలను ఆర్‌ఐలు బి.శ్రీనివాసరావు, కె.రవిశంకరరావు, ఆర్‌ఎస్సైలు ఎం.,రాజా, డి.నిర్మలకుమార్, బి.రవిశంకరబాబు, ఏఆర్‌ఎస్సైలు బి.మోహనరావు, జి.ఆదియ్య, టి.సూర్యనారాయణ, డి.రామనాయుడు, ఎన్.జాకబ్‌రాజు పొందారు.