మహిళలతోనే సమాజాభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

మహిళలతోనే సమాజాభివృద్ధి

Mar 9 2025 12:16 AM | Updated on Mar 9 2025 12:16 AM

మహిళలతోనే సమాజాభివృద్ధి

మహిళలతోనే సమాజాభివృద్ధి

కాకినాడ రూరల్‌: మహిళలు అభివృద్ధి చెందితేనే సమాజం అభివృద్ధి చెందుతుందని వైఎస్సార్‌ సీపీ మహిళా నేత, పిఠాపురం నియోజవర్గ కో ఆర్డినేటర్‌, మాజీ ఎంపీ వంగా గీత అన్నారు. గత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలోనే మహిళలకు సంపూర్ణ గౌరవం దక్కిందని గుర్తు చేశారు. కాకినాడ వైద్య నగర్‌లోని వైఎస్సార్‌ సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్‌ కో ఆర్డినేటర్‌ కురసాల కన్నబాబు నివాసం వద్ద పార్టీ మహిళా నేత వంగా గీత, మహిళా విభాగం అధ్యక్షురాలు వర్ధినీడి సుజాత ఆధ్వర్యాన అంతర్జాతీయ మహిళా దినోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. గీత కేక్‌ కట్‌ చేసి పార్టీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా, కన్నబాబు, కాకినాడ సిటీ, జగ్గంపేట, ప్రత్తిపాడు, పెద్దాపురం కో ఆర్టినేటర్లు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, తోట నరసింహం, ముద్రగడ గిరిబాబు, దవులూరి దొరబాబులతో పాటు మహిళా నేతలకు తినిపించారు. జై జగన్‌ అంటూ మహిళలు పెద్ద ఎత్తున నినదించారు. వారికి కన్నబాబు, దాడిశెట్టి రాజా తదితరులు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గీత మాట్లాడుతూ, అన్ని రంగాల్లోనూ మహిళలు ముందుండాలని, వారు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం బాగుంటుందని నమ్మి, వారి అభివృద్ధిని చేతల్లో చూపిన నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని అన్నారు. పిల్లల చదువు కోసం అమ్మ ఎక్కడా చేయి చాచకూడదనే సమున్నత లక్ష్యంతో అమ్మ ఒడి పథకం ప్రవేశపెట్టారన్నారు. నామినేటెడ్‌ పదవుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు తీసుకువచ్చారని, మహిళల రక్షణకు దిశా చట్టం తీసుకొచ్చేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నించారని చెప్పారు. మహిళలకు 31 లక్షల ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్‌ చేసి ఇచ్చారన్నారు. ప్రజల కోసం పోరాటం చేసే జగన్‌ కోసం ముందుకు నడుస్తామని అన్నారు. వర్ధినీడి సుజాత మాట్లాడుతూ, ఇప్పటి ప్రభుత్వానికి, జగన్‌ ప్రభుత్వానికి మధ్య తేడాను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. మహిళల పేరిట జగన్‌ సంక్షేమ పథకాలు ఇచ్చారని చెప్పారు. పార్టీ బలోపేతానికి మహిళలు కృషి చేయాలని కోరారు. కన్నబాబు మాట్లాడుతూ, జగన్‌మోహన్‌రెడ్డి మహిళా పక్షపాతిగా మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపించారని అన్నారు. మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ప్రతి నెలా రూ.1,500, ఉచిత బస్సు అంటూ చంద్రబాబు అబద్ధాలు చెప్పారన్నారు. మాట ఇస్తే నిలబెట్టుకునే జగన్‌మోహన్‌రెడ్డి వెనుక ఉండటం మనందరి అదృష్టమని అన్నారు. కార్యక్రమంలో పార్టీ మహిళా నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు పెదపాటి అమ్మాజీ, జమ్మలమడక నాగమణి, సుంకర శివప్రసన్న, రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, లక్ష్మీశివకుమారి, కవికొండల సరోజ, జెడ్పీ వైస్‌చైర్‌పర్సన్‌ పద్మావతి తదితరులు పాల్గొన్నారు.

ఫ జగన్‌ ప్రభుత్వంలోనే

వారికి సంపూర్ణ గౌరవం

ఫ వైఎస్సార్‌ సీపీ నేత,

మాజీ ఎంపీ వంగా గీత

ఫ కాకినాడలో ఘనంగా మహిళా దినోత్సవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement