జూరాలకు 3,500 క్యూసెక్కుల వరద | - | Sakshi
Sakshi News home page

జూరాలకు 3,500 క్యూసెక్కుల వరద

Nov 13 2026 4:11 AM | Updated on Nov 13 2026 4:11 AM

అమరచింత: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 3,500 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నట్లు ప్రాజెక్టు ఏఈ సుదర్శన్‌ తెలిపారు. ఎగువన ఉన్న నారాయణపూర్‌ డ్యాం నుంచి వరద ప్రవాహం పూర్తిగా నిలిచిపోయినప్పటికీ.. ఆయకట్టు పరిధిలోని పంట పొలాల నుంచి దిగువకు చేరుతున్న నీరు నదిలో కలుస్తుండటంతో జూరాలకు ప్రవాహం మొదలైందని వివరించారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 2.221 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉందన్నారు. ప్రధాన కుడి, ఎడమ కాలువలతో పాటు ఎత్తిపోతల పథకాలకు నీటి విడుదలను నిలిపివేసినట్లు పేర్కొన్నారు. జూరాల ఆయకట్టు పరిధిలో ప్రస్తుతం 1.15 లక్షల ఎకరాల్లో వరి సాగులో ఉందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement