జలసిరి పనులకు ప్రాధాన్యత ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

జలసిరి పనులకు ప్రాధాన్యత ఇవ్వాలి

Nov 13 2026 4:11 AM | Updated on Nov 13 2026 4:11 AM

గట్టు: వీబీజీ రాంజీ పథకంలో జలసిరి పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని అదనపు కలెక్టర్‌ నర్సింగరావు అన్నారు. గురువారం మండలంలోని తుమ్మలచెరువు గ్రామ శివారులో కొనసాగుతున్న వీబీజీ రాంజీ పనులను ఆయన పరిశీలించి.. వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో 100 మందికి తక్కువ కాకుండా కూలీలకు పనులు కల్పించాలన్నారు. ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో జలసిరి పనుల్లో భాగంగా ప్రతి రైతు పొలంలో తప్పనిసరిగా నీటి కుంటలు, గ్రామంలో ప్రతి ఇంటి దగ్గర ఇంకుడు గుంతలను తప్పనిసరిగా తవ్వించాలని చెప్పారు. అలాగే చెరువులు, కుంటల్లో ఒండ్రుమట్టి తొలగింపు, ఫీడర్‌ చానల్‌, నీటి సంరక్షణ పనులు తప్పనిసరిగా చేపట్టాలన్నారు. వీబీజీ రాంజీ పథకాన్ని కూలీలు వినియోగించుకోవాలని సూచించారు. గ్రామాల్లో తాగునీటి ఇబ్బంది లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో సర్పంచు రాజు, ఏపీడీ శ్రీనివాస్‌, ఎంపీడీఓ మహ్మద్‌అబ్దుల్‌సయ్యద్‌ఖాన్‌, ఎంపీఓ సయ్యద్‌బాసిత్‌, ఏపీఓ స్వామి, కార్యదర్శి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement