అన్నదాతకు నష్టమే.. | - | Sakshi
Sakshi News home page

అన్నదాతకు నష్టమే..

Nov 13 2026 4:11 AM | Updated on Nov 13 2026 4:11 AM

పత్తి ధర పెరిగినా అన్నదాతకు వచ్చిన లాభం పెద్దగా లేదనే చెప్పవచ్చు. బోర్లు, బావులు, వర్షాధారంగా సాగు చేసి.. ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.45 వేల వరకు పెట్టుబడులు పెట్టారు. ఎల్‌నినో ప్రభావంతో అనేక అడ్డంకులు ఎదురవడంతో దిగుబడులు గణనీయంగా తగ్గాయి. ఎకరాకు 7 క్వింటాళ్లు వచ్చిన రైతు కూడా ఆర్థికంగా నష్టపోయాడు. ఆశించిన మేర దిగుబడులు వచ్చి మద్దతు ధరలు లభిస్తేనే రైతులకు ఆర్థికంగా ప్రయోజనం ఉంటుందని చెప్పవచ్చు.

●

స్లాట్‌ బుకింగ్‌ కాలేదు..

జిల్లాలోని సీసీఐ కేంద్రాల్లో పత్తి విక్రయం కోసం ఇప్పటి వరకు రైతులు ఎవరూ స్లాట్‌ బుకింగ్‌ చేసుకోలేదు. పత్తికి బయటి మార్కెట్‌లోనే ఎక్కువ ధరలు లభిస్తున్నాయి. దీని వల్లే రైతులు సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించడానికి ఆసక్తి చూపడం లేదు.

– పుష్ప, జిల్లా మార్కెటింగ్‌ అధికారి

రూ.9 వేలకు

విక్రయించినా నష్టమే..

మూడు ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి సాగు చేశాను. బోరులో నీళ్లు ఉన్నప్పటికీ వాతావరణ పరిస్థితులు అనుకూలించక ఎకరాకు 7 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చింది. కింటా రూ.9 వేల చొప్పున మంచి ధరకు రాయచూర్‌లో అమ్మాను. కానీ, పెట్టిన పెట్టుబడులు, కౌలు డబ్బులు లెక్క వేస్తే నష్టమే మిగిలింది.

– కుమార్‌నాయుడు, పత్తిరైతు, గద్వాల

స్థానిక వ్యాపారులకు అమ్మాను..

ఆరు ఎకరాల్లో వర్షాధారంగా పత్తి పంట వేశాను. వర్షాలు లేకపోవడంతో పంటపై తీవ్ర ప్రభావం పడింది. ఎకరాకు రెండు క్వింటాళ్లలోపే దిగుబడి వచ్చింది. పురుగు మందులు, కూలీలకు బాగా ఖర్చు అయ్యింది. దిగుబడి తక్కువగా రావడంతో స్థానిక వ్యాపారులకే కింటా రూ.8,200 నుంచి రూ.8,600 వరకు పత్తిని అమ్మాను.

– ఖలీమ్‌, పత్తిరైతు, మానవపాడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement