అయిజ వ్యవసాయ మార్కెట్ సబ్ యార్డు లో పశువుల సంత నిర్వహణ ద్వారానే ఏటా సుమారు రూ.2 కోట్ల ఆదాయం వస్తుంది. కానీ, మార్కెట్ సబ్ యార్డులో రైతులు, వ్యాపారులకు ఎలాంటి సౌకర్యాలు లేవు. ఇ ప్పుడు అభివృద్ధి పనుల కోసం రూ.29.50 లక్షలు మంజూరు చేశారు. ఇవి ఏమాత్రం సరి పోవు. కనీసం రూ.కోటి మంజూరు చేయాలి.
– నర్సింహారెడ్డి, రైతు, అయిజ
పనులు చేపట్టాలి..
ఎట్టకేలకు అలంపూర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో అభివృద్ధి పనులు చేపట్టేందుకు రూ.14 లక్షలు, అయిజ మార్కెట్ సబ్ యార్డు లో అభివృద్ధి పనులు చేసేందుకు రూ.29.50 లక్షలు మంజూరయ్యాయి. కానీ, ఈ నిధులు ఏమాత్రం సరిపోవు. అదనపు నిధులు మంజూరు చేయాలి. వచ్చిన నిధులకు ఇంకా అగ్రి మెంట్ కూడా చేసుకోలేదు. ఆ ప్రక్రియ త్వర గా పూర్తిచేసి అభివృద్ధి పనులు పూర్తిచేయాలి.
– శ్రీనివాసులు, రైతు, అయిజ
త్వరలోనే ప్రారంభిస్తాం
అలంపూర్, అయిజ వ్యవసాయ మార్కెట్ యార్డులలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రభుత్వం మంజూరు చేసిన రూ.43.50 లక్షలకు ఇటీవలే టెండర్ పనులు పూర్తయ్యాయి. దీనిపై కాంట్రాక్టర్‌తో అగ్రిమెంట్ చేసుకోవాల్సి ఉంది. త్వరలోనే పనులు ప్రారంభించి.. శరవేగంగా పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటాం.
– పుష్ప, వ్యవసాయ మార్కెట్ జిల్లా ఇన్చార్జి అధికారి
●


