నీటిని పొదుపుగా వాడుకోవాలి | - | Sakshi
Sakshi News home page

నీటిని పొదుపుగా వాడుకోవాలి

Nov 6 2026 12:44 AM | Updated on Nov 6 2026 12:44 AM

గట్టు: వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు నీటి వనరులను పొదుపుగా వాడుకోవాలని జిల్లా ఉద్యాన వన అధికారి రాజ్‌కుమార్‌ అన్నారు. గురువారం గట్టులోని రైతువేదికలో జిల్లా ఉద్యాన వన శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎల్‌నినో ప్రభావం వల్ల వచ్చే ఏడాది జూన్‌ వరకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని, కాబట్టి రైతులు తక్కువ నీటితో పండించే కూరగాయలు సాగు చేయాలని కోరారు. అలాగే పండ్లతోటలకు డ్రిప్‌ ద్వారానే నీటిని మొక్క లకు అందించాలని, మిరప, టమాట, ఇతర కూరగాయల సాగులో తప్పనిసరిగా మల్చింగ్‌ విధానం వేసుకోవాలని కోరారు. మల్చింగ్‌ను 50 శాతం రాయితీ, తీగజాతి కూరగాయల సాగుకు శాశ్వత పందిరి ఏర్పాటుకు 50 శాతం రాయితీ అందిస్తున్నట్లు చెప్పారు. ఉద్యాన కళాశాల ప్రొఫెసర్‌ రాజశేఖర్‌ మాట్లాడుతూ కూరగాయల సాగులో అధిక ఉష్ణోగ్రతలు, తక్కువ వర్షపాతం, నీటి కొరత ప్రాంతాల్లో తీసుకోవాల్సిన పద్ధతుల గురించి వివరించారు. ఆయిల్‌పాం, పండ్ల తోటల్లో నీటి యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించారు. అధిక ఉష్ణోగ్రత సమయంలో మొక్కలకు తగినంత తేమ అందించడం ద్వారా అధిక దిగుబడి సాధించవచ్చని చెప్పారు.

పల్లీ @ రూ.9,400

గద్వాల వ్యవసాయం: జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డుకు గురువారం 680 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. కాగా.. క్వింటాల్‌ గరిష్టంగా రూ.9,400, కనిష్టంగా రూ.4,488, సరాసరిగా రూ.7,366 ధరలు లభించాయి. అలాగే 36 క్వింటాళ్ల ఆముదాలు రాగా క్వింటాల్‌ గరిష్టంగా రూ.7,859, కనిష్టంగా రూ.7,719, సరాసరిగా రూ.7,851 చొప్పున వచ్చాయి. 274 క్వింటాళ్ల వరి (సోన) రాగా.. క్వింటాల్‌ గరిష్టంగా రూ.3,289, కనిష్టంగా రూ.2,668, సరాసరిగా రూ.3,289 ధరలు వచ్చాయి.

జూరాల కాల్వలకు

నీటి సరఫరా బంద్‌

అమరచింత: జూరాల కుడి, ఎడమ కాల్వలకు నీటి సరఫరాను గురువారం తెల్లవారుజాము న నిలిపివేశారు. వారబందీ విధానంలో జూరా ల ఆయకట్టుకు సాగునీటిని అందిస్తున్న ప్రాజె క్టు అధికారులు గత నెల 31న చివరితడి అంటూ ఐదురోజుల పాటు నీటిని వదిలారు. ప్ర స్తుతం జలాశయంలో 1.702 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉందని ఏఈ సుదర్శన్‌ తెలిపారు. ప్రధాన ఎడమ కాల్వ పరిధిలో 85 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా.. వానాకాలంలో రైతులు అత్యధికంగా వరి సాగుచేశారు. అదేవిధంగా కుడి కాల్వ పరిధిలో 35 వేల ఎకరాలు ఉండగా.. 20 వేలు మాత్రమే సాగైంది. ప్రస్తుతం ఇదే చివరితడి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement