పీయూ న్యాక్‌ గ్రేడ్‌ పెంపునకు కృషి చేయాలి | - | Sakshi
Sakshi News home page

పీయూ న్యాక్‌ గ్రేడ్‌ పెంపునకు కృషి చేయాలి

Nov 7 2026 12:48 AM | Updated on Nov 7 2026 12:48 AM

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: పాలమూరు యూనివర్సిటీ (పీయూ) న్యాక్‌ గ్రేడింగ్‌ మెరుగుపరిచేందుకు అధ్యాపకులు, సిబ్బంది సమష్టిగా కృషి చేయాలని వీసీ శ్రీనివాస్‌ సూచించారు. యూనివర్సిటీలో నిర్వహించిన న్యాక్‌ ఏక్యూఏఆర్‌, ఐక్యూఏసీ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. బోధన, పరిశోధన, విద్యార్థుల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాల్లో నాణ్యత పెంచేందుకు అన్ని విభాగాల వారు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. రిజిస్ట్రార్‌ రమేష్‌బాబు మాట్లాడుతూ న్యాక్‌ గ్రేడింగ్‌కు సంబంధించి నిర్ణీత గడువులోగా అవసరమైన ఆధారాలతో నివేదికలు సమర్పించాలని సూచించారు. అన్ని క్రైటీరియా కోఆర్డినేటర్లు, హెచ్‌ఓడీలు సమన్వయంతో వ్యవహరించాలన్నారు. కార్యక్రమంలో ఓఎస్డీ మధుసూదన్‌రెడ్డి, ఐక్యూఏసీ డైరెక్టర్‌ రాజ్‌కుమార్‌, ప్రిన్సిపాళ్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement