గద్వాల క్రైం: చిన్నారులు, యువత.. అనే తేడా లేకుండా అందరికీ ఎంతో ఇష్టమైన దీపావళి పండగ రానే వచ్చేసింది. ఈ నేపథ్యంలో బాణాసంచా కాల్చేందుకు ప్రతిఒక్కరూ ఆసక్తి చూపిస్తారు. అయితే ఆనందోత్సవాల మధ్య జరుపుకొనే ఈ పండుగ.. ఏమాత్రం ఏమారుపాటుగా వ్యవహరించినా విషాదం అలుముకునే అవకాశం లేకపోలేదు. అయితే జిల్లాలోని గద్వాల, అలంపూర్ సెగ్మెంట్‌లో ప్రభుత్వ అనుమతి పొందిన నలుగురు లైసెన్స్‌దారులు ఉన్నారు. తాజాగా పండుగా సందర్భంగా బాణసంచా దుకాణాలు ఏర్పాటుకు 35 మంది తాత్కాలిక అనుమతులు పొందేందుకు అగ్నిమాపక శాఖ అధికారులకు దరఖాస్తులు చేసుకోగా.. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 15 తాత్కాలిక దుకాణాల ఏర్పాటుకు అనుమతించారు. జిల్లాకేంద్రంలోని తేరుమైదానంతోపాటు అలంపూర్ మార్కెట్ యార్డులో ప్రత్యేకంగా దుకాణాలు ఏర్పాటు చేయనున్నారు.
భద్రతకు పెద్దపీట
బాణసంచా దుకాణాలు జనావాసాలకు దూరంగా ఏర్పాటు చేయాలి.
నివాస సముదాయాలకు కనీసం 50 మీటర్ల దూరం ఉండాలి.
దుకాణాల మధ్య మూడు మీటర్లు, తాత్కాలిక షెడ్ల మధ్య పది మీటర్ల దూరం పాటించాలి.
జింక్, జీఐ రేకులతోనే షెడ్లు నిర్మించాలి. ప్లాస్టిక్ కవర్లు, సులభంగా మంటలు అంటుకునే పదార్థాలతో ఏర్పాటు చేయరాదు.
ప్రతి దుకాణం వద్ద రెండు అగ్నిమాపక పరికరాలు, 200 లీటర్ల సామర్థ్యం కలిగిన రెండు నీటి డ్రమ్ములు, నాలుగు నీటి బకెట్లు, రెండు ఇసుక బకెట్లు అందుబాటులో ఉంచాలి.
విద్యుత్ వైరింగ్‌లో ఎలాంటి అతుకులు లేని వైర్లను వినియోగించాలి. పొగతాగడం నిషేధమని సూచించే బోర్డులు, ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి.
వినియోగదారుల రాకపోకలకు ప్రత్యేక మార్గాలు, వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేక స్థలం కేటాయించాలి.
అగ్నిమాపక వాహనాలు సులభంగా చేరుకునేలా షెడ్ల చుట్టూ ఖాళీ స్థలం ఉంచాలి.
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు అవసరమైన నీటి సదుపాయం కల్పించాలి.
దీపావళి నేపథ్యంలో జోరందుకున్న బాణాసంచా విక్రయాలు
జిల్లాలో నలుగురు లైసెన్స్‌దారులు.. మరో 35 మంది తాత్కాలిక దరఖాస్తు
భద్రతా ప్రమాణాలు
పాటించకుంటే దుకాణాల సీజ్


