అయిజ: రైతులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న అలంపూర్ వ్యవసాయ మార్కెట్ యార్డు, అయిజ వ్యవసాయ మార్కెట్ సబ్ యార్డుల అభివృద్ధి పనులకు ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. వ్యవసాయ మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ ఆమోదించిన ప్రొసీడింగ్స్‌లో 2026– 27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి న్యూవర్క్స్ హెడ్ కింద రూ.43.50 లక్షల అదనపు బడ్జెట్‌కు పరిపాలన అనుమతులు లభించాయి. ఈ మేరకు కాంట్రాక్టర్‌తో అధికారులు అగ్రిమెంట్ చేసుకోవాల్సిన పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అగ్రిమెంట్ అనంతరం నిర్మాణం పనులు చేపట్టాల్సి ఉంది.
చేపట్టనున్న పనులు
అయిజ మార్కెట్ సబ్ యార్డులో కార్యాలయ భవనం నిర్మించేందుకు రూ.16 లక్షలు, క్యాటిల్ వర్క్ షెడ్ నిర్మాణానికి రూ.11 లక్షలు, జంగిల్ క్లియరింగ్, గ్రావెల్ ఫిల్లింగ్‌కు రూ.2.50 లక్షల చొప్పున నిధులు మంజూరయ్యాయి. అదేవిధంగా అలంపూర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో జంగిల్ క్లియరింగ్, పల్లపు ప్రదేశంలో గ్రావెల్ ఫిల్లింగ్‌కు రూ.14 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఇటీవల టెండర్ ప్రక్రియ సైతం పూర్తయ్యింది. కాంట్రాక్టర్‌తో అధికారులు అగ్రిమెంట్ చేయించాల్సిన ప్రక్రియ మాత్రమే మిగిలి ఉంది. త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి.
అలంపూర్, అయిజ యార్డుల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం
రూ.43.50 లక్షలతో పూర్తయిన టెండర్ ప్రక్రియ
అగ్రిమెంట్ అనంతరం ప్రారంభం కానున్న నిర్మాణాలు
ఎట్టకేలకు మెరుగుపడనున్న
వసతులు, సౌకర్యాలు
త్వరగా చేపట్టి.. నాణ్యతగా పూర్తిచేయాలని రైతుల వేడుకోలు


