సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ‘పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఢోకా లేకుండా శ్రీశైలం నుంచి అదనంగా 0.6 టీఎంసీల నీటిని తరలించే వ్యవస్థను ఏర్పాటు చేస్తాం. ఏదుల నుంచి డిండికి 0.5 టీఎంసీలు.. అదేవిధంగా అచ్చంపేట లిఫ్ట్‌కు 0.1 టీఎంసీలు తరలించేలా మధ్యే మార్గంగా ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ వ్యవస్థ ఏర్పాటు దిశగా ఎక్కడెక్కడ పంప్‌లు, పంప్ హౌస్‌లు, కెనాళ్లు, టన్నెళ్ల సామర్థ్యం పెంపు కోసం డిజైన్ రూపొందించేలా అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించాం.’
..ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గత నెల 23న మంత్రులు, అధికారులతో సమీక్ష సందర్భంగా చేసిన వ్యాఖ్యలివి. ఏదుల నుంచి రెండు పథకాలకు నీరు తరలించేలా ఖర్చు బేరీజు వేసుకుని ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. అయితే దీనిపైనా ఉమ్మడి జిల్లాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పాటు పలు సాంకేతిక సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఏదుల–డిండి లింక్‌పై భిన్నాభిప్రాయాలు
శ్రీశైలం నుంచి అదనంగా 0.6 టీఎంసీల తరలింపు
పాలమూరుకు ఢోకా లేకుండా ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటుకు అడుగులు
0.5 టీఎంసీలు డిండికి, 0.1 టీఎంసీ అచ్చంపేట లిఫ్ట్‌కు అని సీఎం వెల్లడి
లేని స్పష్టత.. పునరాలోచన చేసి మళ్లీ లింక్ పెట్టడంపై
ప్రజాసంఘాల మండిపాటు
మౌలికంగా భూమి.. అనుబంధంగా నీటి పోరాటమని వెల్లడి
ఈ సమస్య పరిష్కారం కాకుండా స్కీం పూర్తి కాదని స్పష్టం


