● సీఎం రేవంత్‌రెడ్డికి ఆహ్వాన పత్రిక
అందజేసిన మంత్రి వాకిటి శ్రీహరి
చిన్నచింతకుంట: కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి ఆహ్వానించారు. గు రువారం హైదరాబాద్‌లో పశుసంవర్ధక, క్రీడా, యువజనశాఖమంత్రి వాకిటి శ్రీహరితో కలిసి సీఎంని కలిశారు. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అందజేసి ఉత్సవాలకు రావాలని కోరారు. అనంతరం ముఖ్యమంత్రి చేతుల మీదు గా బ్రహ్మోత్సవాల వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు.
● కురుమూర్తి స్వామి ఆలయ అభివృద్ధితోపాటు భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు అదనంగా రూ.100కోట్ల నిధులు మంజూరు చేయా లని సీఎం రేవంత్‌రెడ్డికి ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. ఆలయ పరిసరాల్లో అభివృద్ధి పనులు, రహదారులు, తాగునీటి సౌకర్యాల కల్పనకు నిధులు కేటాయించాలని కోరినట్లు తెలిపారు. దీనిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. కార్యక్రమంలో టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ అరవింద్‌కుమార్‌రెడ్డి, ఆలయ చైర్మన్ బత్తుల బాల్‌రాజు, ఈఓ మధనేశ్వరరెడ్డి, ఆలయ పూజారులు వెంకటయ్య, సత్యం, కమిటీ సభ్యుడు భరత్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.


