ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు | - | Sakshi
Sakshi News home page

ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు

Nov 6 2026 12:44 AM | Updated on Nov 6 2026 12:44 AM

గద్వాల క్రైం: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసు శాఖ వ్యూహాత్మకంగా చర్యలు చేపట్టాలని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. గురువారం ఎస్పీ కార్యాలయంలో నేర సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. శాంతిభద్రతల విషయంలో అప్రమత్తంగా ఉంటూ అనుమానాస్పద కేసులపై వేగంగా విచారణ చేపట్టాలన్నారు. జిల్లాలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న మద్యం సిట్టింగ్‌ దాబాలు, చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలన్నారు. నిషేధిత మత్తు పదార్థాల విక్రేతలపై నిఘా ఉంచి క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలన్నారు. గంజాయి వంటి వ్యసనాలకు అలవాటు పడిన యువతను గుర్తించి కౌన్సెలింగ్‌ ఇవ్వాలన్నారు. జిల్లావ్యాప్తంగా పెట్రోలింగ్‌, గస్తీ పెంచాలని, వివిధ పోలీసుస్టేషన్లలో నమోదైన కేసులు, సమస్యలపై వచ్చే బాధితులకు న్యాయం అందేలా చూడాలన్నారు. రోడ్డు ప్రమాదాలపై విలేజ్‌ రోడ్డు సేఫ్టీ కమిటీలను ఏర్పాటు చేయాలని సిబ్బందికి ఆదేశించా రు. హిట్‌ అండ్‌ రన్‌ ప్రమాదాలపై ప్రత్యేక విచారణ చేపట్టాలన్నారు. అనుమతి లేకుండా ఇసుక, మట్టి, రేషన్‌ బియ్యం అక్రమ తరలింపు, పేకాట ఆడటం వంటివి కట్టడి చేయాలన్నారు. సరిహద్దు ప్రాంతా ల్లో పట్టిష్టమైన నిఘా పెట్టాలన్నారు. స్టేషనలో నమోదైన కేసుల విషయంలో నిర్లక్ష్యం లేకుండా వీలైనంత త్వరగా కోర్టులో చార్జీషీట్‌ దాఖలు చేసి నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలన్నా రు. సైబర్‌ కేసులపై విస్తృతంగా అవగాహన కల్పించాలని చెప్పారు. సమావేశంలో ఏఎస్పీ శంకర్‌, డీఎస్పీ మొగిలయ్య, సీఐలు శ్రీను, ప్రదీప్‌కుమార్‌, ఎస్‌ఐలు పాల్గొన్నారు. అనంతరం హెడ్‌కానిస్టేబుల్‌గా పదోన్నతి మానవపాడు పోలీసుస్టేషన్‌ కాని స్టేబుల్‌ తిరుమలేష్‌ను ఎస్పీ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement