పుస్తక పఠనాన్ని అలవాటుగా చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

పుస్తక పఠనాన్ని అలవాటుగా చేసుకోవాలి

Nov 6 2026 12:44 AM | Updated on Nov 6 2026 12:44 AM

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: విద్యార్థులు పుస్తక పఠనాన్ని అలవాటుగా చేసుకోవాలని పీయూ వీసీ శ్రీనివాస్‌ సూచించారు. పీయూ లైబ్రరీలో ఏర్పాటు చేసిన మూడు రోజుల పుస్తక ప్రదర్శనను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పుస్తకాలు చదవడం వల్ల ఉన్నత విద్య, పరిశోధనతో పాటు పోటీ పరీక్షల్లో రాణించేందుకు అవసరమైన జ్ఞానం లభిస్తుందని పేర్కొన్నారు. వ్యక్తిత్వ వికాసం, సృజనాత్మకత పెంపొందించుకోవడానికి పఠనం దోహదపడుతుందన్నారు. పీయూలో పోటీ పరీక్షల పుస్తకాలతో పాటు వివిధ మ్యాగజైన్లు, దినపత్రికలు అందుబాటులో ఉన్నాయని, విద్యార్థులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గొప్ప వ్యక్తులు పుస్తక పఠనం ద్వారానే ఉన్నత స్థాయికి చేరుకున్నారని గుర్తుచేశారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ రమేష్‌బాబు, కంట్రోలర్‌ ప్రవీణ, ప్రిన్సిపాల్‌ మధుసూదన్‌రెడ్డి, ఈశ్వర్‌కుమార్‌, భూమయ్య, కరుణాకర్‌రెడ్డి, ఐక్యూఏసీ డైరెక్టర్‌ రాజ్‌కుమార్‌, అర్జున్‌కుమార్‌, కోఆర్డినేటర్‌ జయనాయక్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement