గద్వాల: ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు జిల్లా అధికార యంత్రాంగం సమష్టిగా కృషిచేయా లని అదనపు కలెక్టర్ మధుమోహన్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌జాజు నిర్వహించిన వీసీలో అదనపు కలెక్టర్ పాల్గొని జిల్లాలో పరిస్థితులు వివరించారు. మల్లమ్మకుంట రిజర్వాయర్ నిర్మాణానికి అవసరమైన భూ సేకరణను వేగవంతం చేశామని, అవార్డు పాసైన రైతులకు సత్వరమే డబ్బులు చెల్లించేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురిసినందున ప్రజలకు తాగునీటి విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నట్లు చెప్పా రు. రబీ సీజన్లో రైతులు తమ బోరు బావుల్లో నీటిలభ్యత ఆధారంగా ఆరుతడి పంటలు మాత్రమే సాగుచేసేలా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. సమావేశంలో ఎస్డీసీ కృష్ణ, ఆర్డీఓ శ్రీనివాసరావు, ఏఓ మంజుల తదితరులు పాల్గొన్నారు.


