చట్టాలపై అవగాహన తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

చట్టాలపై అవగాహన తప్పనిసరి

Oct 30 2026 12:51 AM | Updated on Oct 30 2026 12:51 AM

గద్వాల క్రైం: ప్రతి ఒక్కరికీ చట్టాలపై తప్పనిసరిగా అవగాహన ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, జూనియర్‌ సివిల్‌జడ్జి నిష్కాపాత్రుడు సూచించారు. గురువారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులకు బాలల హక్కులు, సైబర్‌ నేరాలు, భద్రత అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. చట్టాలపై అవగాహనతో నేరాలను నియంత్రించవచ్చన్నారు. బాలబాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. ఎవరైనా అనుచితంగా వ్యవహరించినా, వేధింపులకు పాల్పడినా ఎలాంటి భయాందోళన లేకుండా తల్లిదండ్రులకు తెలియజేయాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో రాంభూపాల్‌రెడ్డి, రాఘవేంద్ర, సవరన్న పాల్గొన్నారు.

జిల్లాస్థాయి టెన్నికాయిట్‌ క్రీడాకారుల ఎంపిక

గద్వాలన్యూటౌన్‌: జిల్లా టెన్నికాయిట్‌ అసోసియేషన్‌ ఆద్వర్యంలో గురువారం స్థానిక ఇండోర్‌ స్టేడియంలో జిల్లాస్థాయి టెన్నికాయిట్‌ క్రీడాకారుల ఎంపికలు నిర్వహించారు. అండర్‌–18 బాలబాలికల విభాగంలో జరిగిన ఎంపిక పోటీలకు జిల్లాలోని అన్ని మండలాల నుంచి 85 మంది క్రీడాకారులు హాజరై ప్రతిభ చాటారు. వీరిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారిని శుక్రవారం నారాయణపేటలో జరిగే ఉమ్మడి జిల్లాస్థాయి, జోనల్‌ స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌జీఎఫ్‌ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు, టెన్నికాయిట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు భరత్‌కుమార్‌, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గోపాలం, కార్యదర్శి రాజు, హైమావతి, ప్రభాకర్‌, అరుణ, సునీత, రాధ, మల్లేశ్వరి, శ్రీనివాసులు పాల్గొన్నారు.

వేరుశనగ క్వింటా రూ.8,070

గద్వాలవ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డుకు గురువారం 254 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. క్వింటాకు గరిష్టంగా రూ. 8,070, కనిష్టంగా రూ. 5,320, సరాసరి రూ. 6,390 ధరలు లభించాయి. అలాగే 19 క్వింటాళ్ల ఆముదాలు రాగా.. క్వింటాకు గరిష్టంగా రూ. 7,950, కనిష్టంగా రూ. 7,839, సరాసరి రూ. 7930 ధరలు పలికాయి. 19 క్వింటాళ్ల వరి (సోన) రాగా.. రూ. 3,227 ధర వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement