బాలకార్మిక వ్యవస్థ రూపుమాపడమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

బాలకార్మిక వ్యవస్థ రూపుమాపడమే లక్ష్యం

Oct 30 2026 12:51 AM | Updated on Oct 30 2026 12:51 AM

మల్దకల్‌: బాలకార్మిక వ్యవస్థను రూపుమాపడమే తమ ప్రధాన లక్ష్యమని జిల్లా అసిస్టెంట్‌ లేబర్‌ కమిషనర్‌ వేణుగోపాల్‌ అన్నారు. గురువారం మండలంలోని నేతువానిపల్లి, పెద్దొడ్డితో పాటు పలు గ్రామాల్లో ఆయన ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా 14మంది బాలకార్మికులను గుర్తించి, స్థానిక పోలీస్‌స్టేషన్‌ వద్ద వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. పిల్లలతో హోటళ్లు, ఇటుక బట్టీలు, వ్యవసాయ పనులు చేయిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. బాలకార్మిక వ్యవస్థను పూర్తిస్థాయిలో రూపుమాపేందుకు అందరూ సహకరించాలని కోరారు. ముఖ్యంగా రైతులు పిల్లలతో పొలం పనులు చేయించొద్దని తెలిపారు. బాలలతో పనులు చేయించుకునే వారికి రెండేళ్ల జైలుశిక్షతో పాటు రూ. 20వేల నుంచి రూ. 50వేల జరిమానా విధించే అవకాశం ఉంటుందన్నారు. బాలల హక్కులను కాపాడి, వారి బంగారు భవిష్యత్‌కు తమవంతుగా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో సీనియర్‌ అసిస్టెంట్‌ అబ్రహం, జిల్లా బాలల పరిరక్షణ విభాగం అధికారి సురేశ్‌, సిబ్బంది లక్ష్మీదేవి, నవీన్‌, లక్ష్మి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement