ప్రజావాణికి 27 అర్జీలు | - | Sakshi
Sakshi News home page

ప్రజావాణికి 27 అర్జీలు

Oct 27 2026 12:03 AM | Updated on Oct 27 2026 12:03 AM

గద్వాల: ప్రజావాణిలో ఇచ్చిన దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్‌ రిజ్వాన్‌బాషాషేక్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి మొత్తం 27 ఫిర్యాదులు స్వీకరించారు. జిల్లాస్థాయి ప్రజావాణిలో వచ్చిన 94 ఫిర్యాదులలో ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్నాయని వీటిని పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ నర్సింగ్‌రావు, ట్రైనీ డీసీ రాజ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

పోలీస్‌ గ్రీవెన్స్‌కు

13 ఫిర్యాదులు

గద్వాల క్రైం: జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌ కార్యక్రమానికి వివిధ గ్రామాల నుంచి అర్జీదారులు పలు సమస్యలపై 13 అర్జీలను ఎస్పీ శ్రీనివాసరావుకు అందజేశారు. ఇందులో ఆస్తి వివాదం, భూ సంబంధ, మోసాలు తదితర అంశాలపై ఉన్నాయి. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అన్ని ఫిర్యాదులను ఆయా స్టేషన్‌ అధికారులకు సిఫార్సు చేస్తూ పరిష్కరించాలని సూచించారు. భూ వివాద సమస్యలపై కోర్టు ద్వారా పరిష్కారం పొందాలని చెప్పారు.

దరఖాస్తుల ఆహ్వానం

గద్వాల: జిల్లాలోని ఉండవెల్లి మైనార్టీ గురుకుల పాఠశాలలో ఖాళీగా ఉన్న టీజీటీ ఇంగ్లిష్‌ పోస్టుకు అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్‌ రిజ్వాన్‌బాషాషేక్‌ సోమవారం ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల అర్హులైన మహిళా అభ్యర్థులు తమ దరఖాస్తులను కలెక్టరేట్‌లోని మైనార్టీ సంక్షేమ శాఖ కార్యాలయంలో ఈ నెల 31 వరకు అందజేయాలన్నారు. పూర్తి వివరాలకు సెల్‌ నం.80990 59007ను సంప్రదించాలని సూచించారు.

ఆదిశిలావాసుడికి

బంగారం బహూకరణ

మల్దకల్‌: ఆదిశిలా క్షేత్రమైన స్వయంభూ లక్ష్మీవేంకటేశ్వరస్వామికి సోమవారం గద్వాలకు చెందిన దాత విజయసారధి, దీపిక దంపతులు ఆలయ చైర్మన్‌ ప్రహ్లాదరావు 10 గ్రాముల బంగారు కౌస్తుభం బిళ్లను బహూకరించారు. అనంతరం దాత కుటుంబ సభ్యులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా.. ఆలయ చైర్మన్‌ వారిని శాలువాతో సత్కరించి జ్ఞాపిక అందజేశారు.

పల్లీ క్వింటా ధర

రూ.7,869

గద్వాల వ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డుకు సోమవారం 227 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. కాగా.. క్వింటాల్‌ గరిష్టంగా రూ.7,869, కనిష్టంగా రూ.5,819, సరాసరిగా రూ.6,389 ధరలు లభించాయి. అలాగే 33 క్వింటాళ్ల ఆముదాలు రాగా.. క్వింటాల్‌ గరిష్టంగా రూ.8,031, కనిష్టంగా రూ.7,869, సరాసరిగా రూ.7,959 చొప్పున వచ్చాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement