వాల్మీకి జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం | - | Sakshi
Sakshi News home page

వాల్మీకి జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం

Oct 27 2026 12:03 AM | Updated on Oct 27 2026 12:03 AM

ఎర్రవల్లి: ప్రతిఒక్కరూ వాల్మీకి మహర్షి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని మంచి మార్గంలో నడవాలని పదో బెటాలియన్‌ అదనపు కమాండెంట్‌ ఆదినారాయణ అన్నారు. సోమవారం మండలంలోని బీచుపల్లి పదో పటాలంలో వాల్మీకి జయంతి వేడుకలను పురస్కరించుకొని నిర్వహించిన కార్యక్రమంలో మహర్షి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వాల్మీకి జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయం అన్నారు. ఆయన జీవితంలో జరిగిన పరివర్తన ద్వారా రామాయణ మహాకావ్యాన్ని రచించి ఆదికవిగా ప్రసిద్ధి చెందారని కొనియాడారు. మనిషి తన ఆలోచనలు, ప్రవర్తనను మార్చుకోవడం ద్వారా ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని వాల్మీకి మహర్షి జీవితం తెలియజేస్తుందని అభిప్రాయపడ్డారు. ఆయన రచించిన రామాయణం ధర్మం, సత్యం, నైతిక విలువలు, ఆదర్శ జీవన విధానాలకు మార్గదర్శకం అని పేర్కొన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ కమాండెంట్లు పార్థసారధిరెడ్డి, వెంకటరమణ, ఆర్‌ఐలు నర్సింహరాజు, శ్రీనివాస్‌, రాజేశం, తిరుపతి, యూనిట్‌ ఆస్పత్రి వైద్యాధికారి సాయి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement