నీటి పొదుపుతోనే భావితరాల మనుగడ | - | Sakshi
Sakshi News home page

నీటి పొదుపుతోనే భావితరాల మనుగడ

Sep 25 2026 1:41 AM | Updated on Sep 25 2026 1:41 AM

● కలెక్టర్‌ రిజ్వాన్‌బాషా షేక్‌

గద్వాల: నీటి పొదుపుపైనే భావితరాల మనుగడ ఆధారపడి ఉంటుందని కలెక్టర్‌ రిజ్వాన్‌బాషా షేక్‌ అన్నారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని భారత్‌ మండపంలో ఈ నెల 20 నుంచి శనివారం వరకు నిర్వహిస్తున్న 9వ ఇండియా ఇంటర్నేషనల్‌ వాటర్‌ వీక్‌ వేడుకల్లో ఆయన ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొన్నారు. గురువారం జరిగిన కార్యక్రమంలో జిల్లాలో అమలవుతున్న ఉత్తమ నీటి నిర్వహణ పద్ధతులపై ఆయన ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రిజర్వాయర్ల నిల్వ సామర్థ్యాన్ని పెంచడం వీబీజీ రాంజీ పథకం ద్వారా జల సంరక్షణ పనులు చేపట్టడం, ఆయిల్‌పాం సాగు విస్తరణ మైక్రో ఇరిగేషన్‌, మత్య్స సంపద అభివృద్ధి వంటి అంశాలు వివరించారు. వీబీజీ రాంజీ పథకంలో నీటి సంరక్షణ పనులను గుర్తించి అమలు చేస్తే కరువు కాటకాలను సమర్థవంతంగా అధిగమించవచ్చన్నారు. గ్రామాల్లో ప్రతిఒక్కరు ఇంటి వద్ద ఇంకుడు గుంతలు, రైతుల పొలాల్లో పంట కుంటలు, ఊట కుంటల నిర్మాణాల ఆవశ్యకతను గుర్తుచేశారు. బిందు సేద్యంతో తక్కువ నీటితో ఆరుతడి పంటలు సాగు చేసే విధానాన్ని ప్రోత్సహించాలని, సామాజిక అడవులు పెంపకం, చెక్‌డ్యాంల నిర్వహణపై దృష్టి సారించాలని, పచ్చదనం పెరిగితే వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, జల సంరక్షణ కేవలం ప్రభుత్వలకే పరిమితం కాకుండా ప్రజలందరి భాగస్వామ్యం ఉంటేనే సఫలమవుతుందని కలెక్టర్‌ పేర్కొన్నారు. జాతీయ వేదికపై మాట్లాడే అవకాశం కల్పించిన నిర్వాహకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement