‘నవోదయ’ ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

‘నవోదయ’ ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ

Sep 24 2026 1:48 AM | Updated on Sep 24 2026 1:48 AM

నారాయణపేట: జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో 2027–28 విద్యా సంవత్సరం 9, 11వ తరగతుల్లో ఖాళీల భర్తీకి నిర్వహించే ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్‌ సీహెచ్‌ ప్రియాంక బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు గడువు ఈ నెల 30తో ముగియనుందని.. అర్హత, ఆసక్తిగల విద్యార్థులు సంబంధిత పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ప్రవేశ పరీక్ష 2027, ఏప్రిల్‌ 10న జరగనుందని తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, గుర్తింపు పొందిన ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, జిల్లా విద్యాశాఖ అధికారులు, మండల విద్యాధికారులు విస్తృతంగా అవగాహన కల్పించాలని.. విద్యార్థులు, తల్లిదండ్రులకు పరీక్ష, దరఖాస్తు విధానం తదితర వివరాలను తెలియజేసి గరిష్టంగా దరఖాస్తు చేసుకునేలా చర్యలు చేపట్టాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement