ఆధ్యాత్మిక కేంద్రమైన శ్రీశైలం వరకు రహదారి విస్తరణ జరిగితే అభివృద్ధికి మార్గం వేసినట్లు అవుతుంది. హైదరాబాద్ – శ్రీశైలం – తోకలపల్లి వరకు విస్తరించి ఉన్న 765 జాతీయ రహదారి విస్తరణ జరగాల్సి ఉంది. మన్ననూర్ – శ్రీశైలం– దోర్నాల మధ్య పులుల రక్షిత ప్రాంతం ఉండటంతో ఇబ్బందులు వస్తున్నాయి. దీని అధిగమించి రెండు రాష్ట్రాల మధ్య దూరం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం దృష్టికి రెండు తెలుగు రాష్టాలు ప్రతిపాదనలు సిద్ధం చేశాయి. ఇందుకోసం సీఎం రేవంత్‌రెడ్డి రతన్‌టాటా గ్రీన్‌ఫీల్డు హైవేను పొడిగిస్తూ ప్రతిపాదిత ఎలివేటెడ్ కారిడార్ వరకు గ్రీన్ ఫీల్డు హైవేతో పాటు బుల్లెట్ ట్రైన్ కోసం 100 మీటర్ల వెడల్పుతో సర్వే చేశారు. త్వరలోనే డీపీఆర్ సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తారు.
– డా.చిక్కుడు వంశీకృష్ణ, ఎమ్మెల్యే, అచ్చంపేట


